News October 13, 2025
SRSP UPDATE: 8 గేట్ల ద్వారా నీటి విడుదల

SRSP నుంచి సోమవారం 9 గంటలకు 8 వరద గేట్ల ద్వారా 25 వేల క్యూసెక్కుల నీరు గోదావరిలోకి విడిచిపెట్టినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 84,790 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండగా ఔట్ ఫ్లోగా 84,790 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నామన్నారు. కాగా ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 80.501 TMCలకు గాను తాజాగా పూర్తిగా 80.501TMC ల నీరు నిల్వ ఉందని వివరించారు.
Similar News
News October 13, 2025
నిజామాబాద్: 8వ జాతీయ పోషణ మాసోత్సవ పోస్టర్ ఆవిష్కరణ

8వ జాతీయ పోషణ మాసం 2025 సందర్భంగా సోమవారం IDOC సమావేశ మందిరంలో పోషణ మాసానికి సంబంధించిన పోస్టర్‌లను ఆవిష్కరించారు. ఈ నెల 16న జరిగే సమావేశం విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్ తియాన్ మావి, మహిళా, శిశు, దివ్యాంగుల వయోవృద్దుల శాఖా జిల్లా అధికారిణి రసూల్ బీ పాల్గొన్నారు.
News October 13, 2025
నిజామాబాద్: పోలీసు సిబ్బందికి ఉలెన్ జాకెట్స్ అందజేత

చలికాలం సమీపించిన నేపథ్యంలో విధి నిర్వహణలో పోలీసులకు ఉపయుక్తంగా ఉండే ఉలెన్ జాకెట్స్, హావర్ సాక్స్‌లను నిజామాబాద్ సీపీ సాయి చైతన్య అందజేశారు. ఈ మేరకు సోమవారం కమిషనరేట్ కార్యాలయంలో ఏఆర్, సివిల్ పోలీసు సిబ్బందికి ఉలెన్ జాకెట్స్ అందజేసి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, స్పెషల్ బ్యాంక్ సబ్ ఇన్‌స్పెక్టర్ సంతోష్ రెడ్డి, RSI నిషిత్, సుమన్ పాల్గొన్నారు.
News October 13, 2025
నిజామాబాద్: ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన సీపీ

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం నిజమాబాద్ సీపీ సాయి చైతన్య ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను సీపీకి విన్నవించారు. మొత్తం 20 ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పారు. వాటి పరిష్కారానికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజలు ఏవైనా సమస్యలు ఉంటే ప్రజావాణిలో నేరుగా సంప్రదించాలన్నారు.