News October 13, 2025
నాలుగో రోజు ప్రారంభమైన ఆట

భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. ఫాలో ఆన్ ఆడుతున్న WI 93 పరుగుల వెనుకంజలో ఉంది. నిన్న 35కే రెండు వికెట్లు కోల్పోయినా క్యాంప్‌బెల్(90), హోప్(67) క్రీజులో నిలదొక్కుకొని 138 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం WI స్కోర్ 177/2గా ఉంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 518/5 డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే.
Similar News
News October 13, 2025
అంతర్గాంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు పరిశీలన

TG: రాష్ట్రంలో ఎయిర్ కనెక్టివిటీని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు గతంలో ఎంపికచేసిన పెద్దపల్లి(D) బసంత్‌నగర్ అనుకూలంగా లేకపోవడంతో సమీపంలోని అంతర్గాం ప్రాంతాన్ని పరిశీలిస్తోంది. టెక్నో ఎకనామిక్ ఫీజుబులిటీ నివేదిక కోసం AAIకి ఫీజు చెల్లించనుంది. ఇప్పటికే మామునూరు(WGL)ను ఫైనల్ చేసిన ప్రభుత్వం కొత్తగూడెం, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లలో ఎయిర్‌పోర్టులపై ఆలోచిస్తోంది.
News October 13, 2025
CRDA భవనాన్ని ప్రారంభించిన CM CBN

AP: రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన సీఆర్డీఏ భవనం అందుబాటులోకి వచ్చింది. దీన్ని సీఎం చంద్రబాబు ఇవాళ ప్రారంభించారు. భవనం లోపల క్షుణ్ణంగా పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం బిల్డింగ్ బయట ఫొటోలు దిగారు. హైదరాబాద్‌కు దీటుగా అమరావతిని అభివృద్ధి చేస్తానని సీఎం స్పష్టం చేశారు.
News October 13, 2025
WBలో తాలిబన్ పాలన నడుస్తోంది: BJP, CPM

వైద్య విద్యార్థిని రేప్ ఘటనపై WB CM మమత వ్యాఖ్యలు వివాదంగా మారాయి. అర్ధరాత్రి ఆమె బయటకు ఎలా వచ్చిందనడంపై నేతలు మండిపడుతున్నారు. ‘ఇక్కడ తాలిబన్ పాలన నడుస్తోంది. మహిళలు రాత్రివేళ బయటకు రావద్దా? వస్తే రేప్ చేస్తామంటారా?’ అని BJP MLA అగ్నిమిత్ర ప్రశ్నించారు. ‘స్త్రీలు పురుషులతో సమానం కాదా? వారి భద్రత ప్రభుత్వ బాధ్యత కాదా?’ అని CPM నిలదీసింది. కాగా తన కామెంట్లను మీడియా వక్రీకరించిందని మమత అన్నారు.