News October 13, 2025

పల్నాడులో ఆ మున్సిపాలిటీకి అత్యధిక ఆదాయం

image

పల్నాడు జిల్లాలో నరసరావుపేటకు అత్యధిక ఆదాయం పన్నుల రూపంలో ఈ ఏడాది రూ.89 లక్షలు సమకూరింది. మున్సిపాలిటీలు స్వయం ప్రతిపత్తిని సాధించాలనే రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ఆస్తి పన్నులపై ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. దీంతో మాచర్లకు రూ. 36 లక్షలు, సత్తెనపల్లికి రూ. 29లక్షలు, పిడుగురాళ్లకు రూ. 26 లక్షలు, గురజాలకు రూ. 12 లక్షలు ఆదాయం లభించింది. పన్నుల విధానంపై ఇంటింటి సర్వేతో సాధ్యమైందని అధికారులంటున్నారు.

Similar News

News October 13, 2025

NZSR: వాహనం ఢీకొని బాలిక మృతి

image

వాహనం ఢీకొని చిన్నారి మృతి చెందిన ఘటన నిజాంసాగర్(M) అచ్చంపేటలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మధురశ్రీ(3) బహిర్భూమికి వెళ్లి పరుగెత్తుకు వెళ్తుండగా అకస్మాత్తుగా గూడ్స్ వాహనం వెనక టైర్ కింద పడింది. ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇంటికి తీసుకువచ్చిన తరువాత మళ్లీ ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది.

News October 13, 2025

కూల్ అండ్ గ్లో ఫేస్ ప్యాక్

image

పొడిచర్మం ఉన్నవారు పలు చర్మ సమస్యలను ఎదుర్కొంటారు. వారి చర్మంలోని మాయిశ్చర్‌ని రిస్టోర్ చేయడానికి ఈ బీట్‌రూట్ ఫేస్‌ప్యాక్ పనిచేస్తుంది. ముందుగా బీట్‌రూట్ జ్యూస్, శనగపిండి, పెరుగు, తేనె కలుపుకోవాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి 10 ని. తర్వాత శుభ్రం చేసుకుంటే చర్మం తాజాగా, కాంతిమంతంగా మారుతుంది. వారానికి మూడుసార్లు ఈ ప్యాక్‌ను అప్లై చేసుకోవడం వల్ల చర్మం తాజాగా ఉంటూ మెరుపును సంతరించుకుంటుంది. <<-se>>#skincare<<>>

News October 13, 2025

అంతర్గాంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు పరిశీలన

image

TG: రాష్ట్రంలో ఎయిర్ కనెక్టివిటీని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు గతంలో ఎంపికచేసిన పెద్దపల్లి(D) బసంత్‌నగర్ అనుకూలంగా లేకపోవడంతో సమీపంలోని అంతర్గాం ప్రాంతాన్ని పరిశీలిస్తోంది. టెక్నో ఎకనామిక్ ఫీజుబులిటీ నివేదిక కోసం AAIకి ఫీజు చెల్లించనుంది. ఇప్పటికే మామునూరు(WGL)ను ఫైనల్ చేసిన ప్రభుత్వం కొత్తగూడెం, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లలో ఎయిర్‌పోర్టులపై ఆలోచిస్తోంది.