News October 13, 2025

పెద్ద తాడివాడలో క్షుద్ర పూజల కలకలం

image

డెంకాడ మండలం పెద్ద తాడివాడ గ్రామంలో క్షుద్ర పూజలు జరిగాయని స్థానికులు తెలిపారు. గ్రామానికి చెందిన పైడియ్య ఇంటి గుమ్మం దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం మనిషి పుర్రెను పెట్టి పూజలు జరగడంతో గ్రామస్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రస్తుత కాలంలో కూడా మూఢనమ్మకాలతో కొన్ని గ్రామాల్లో ఇలాంటి పూజలు జరగడం చర్చ నీయాసంగా మారింది. ఎవరు ఈ క్షుద్ర పూజలు చేశారు అనే విషయంపై డెంకాడ పోలీసులు ఆరాతీస్తున్నారు.

Similar News

News October 13, 2025

విజయనగరం పోలీసు వెల్ఫేర్ స్కూల్‌లో టీచర్ ఉద్యోగాలు: SP

image

పోలీసు వెల్ఫేర్ ఇంగ్లీషు మీడియం పాఠశాలలో ఖాళీగా ఉన్న రెండు ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఎస్పీ దామోదర్ సోమవారం తెలిపారు. ఇంగ్లీష్ సబ్జెక్ట్‌ను బోధించేందుకు డీఈడీ/బీఈడీ అర్హత గల వారు కావాలన్నారు. ఆసక్తి ఉన్న వారు ఈనెల 16న ఉ.10 గంటలకు విజయనగరం కంటోన్మెంట్ పోలీసు క్వార్టర్స్‌లో ఉన్న పోలీసు వెల్ఫేర్ పాఠశాలలో జరగనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాలన్నారు.

News October 13, 2025

విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయానికి 40 ఫిర్యాదులు

image

జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను సోమవారం నిర్వహించారు. మొత్తం 40 ఫిర్యాదులు స్వీకరించగా, అందులో భూ తగాదాలు 8, కుటుంబ కలహాలు 5, మోసాలు 4, నగదు వ్యవహారం 1, ఇతర అంశాలు 22 ఉన్నాయని ఎస్పీ దామోదర్ తెలిపారు. ఫిర్యాదులపై 7 రోజుల్లో చర్యలు తీసుకుని నివేదికను జిల్లా పోలీసు కార్యాలయానికి పంపాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.

News October 13, 2025

అధికారులకు విజయనగరం కలెక్టర్ కీలక ఆదేశాలు

image

పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెస్‌ల్ సిస్టమ్ (PGRS) కార్యక్రమాలకు మండల, మున్సిపల్ స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఫిర్యాదుల రీ-ఓపెనింగ్ తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రతి రోజు కనీసం 60 ఫిర్యాదుదారుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు.