News April 8, 2024

మోదీ గెలవాలని వేలు కట్ చేసుకున్నాడు

image

ప్రధాని మోదీ మూడోసారి గెలవాలని ఆకాంక్షిస్తూ అరుణ్ అనే వ్యక్తి తన చూపుడు వేలును కాళీమాతకు బలిదానం ఇచ్చాడు. ఆ తర్వాత రక్తంతో ఆలయ గోడలపై.. ‘మోదీ అందరికన్నా గొప్పవారు. నువ్వు ఆయనను గెలిపించాలి కాళీమాత’ అని రాశాడు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. అతను తన ఇంట్లోనే మోదీకి గుడి కట్టి రోజూ పూజలు చేస్తున్నాడు. కాగా నాయకులపై అభిమానంతో శరీరాలను గాయపరచుకునే పిచ్చి పనులు చేయొద్దని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Similar News

News January 25, 2026

జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి ఈ జాగ్రత్తలు

image

జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. క్లోరిన్‌ కలిపిన నీటిలో స్విమ్ చేసే ముందు మంచినీళ్లతో తలస్నానం చేసి క్యాప్‌ పెట్టుకోవాలి. స్విమ్మింగ్ తర్వాత మంచి నీళ్లతో తలస్నానం చేయాలి. ఎండలోకి వెళ్లే ప్రతిసారీ సన్‌స్ర్కీన్‌ హెయిర్‌ స్ర్పే వాడాలి. తలకు మరీ వేడి/ చల్లని గాలి తరచూ తగలకుండా స్కార్ఫ్‌/ క్యాప్‌ పెట్టుకోవాలి. వీటితో పాటు పోషకాహారం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

News January 25, 2026

ఇవాళ నాన్ వెజ్ తినకండి! ఎందుకంటే..

image

వారంలో కొన్ని రోజులు కొందరు దేవుళ్ల పేరిట నియమాలు పాటించి సండే ఏ రూల్ పెట్టుకోం. కానీ లోకానికి వెలుగునిచ్చే ఆదిత్యుడి రోజైన ఆదివారం మాంసం జోలికి పోకూడదట. సూర్యాష్టక శ్లోకం ‘స్త్రీ తైల మధు మాంసాని యే త్యజంతి రవేర్దినే| న వ్యాధి శోక దారిద్య్రం సూర్యలోక స గచ్ఛతి’ ప్రకారం.. ఆదివారం స్త్రీ సాంగత్యం, తల నూనె, మద్యం, మాంసం తాకలేదంటే దారిద్ర్య విముక్తి, సూర్యలోక ప్రాప్తి. ఈరోజు సూర్య జయంతి-రథ సప్తమి.

News January 25, 2026

పశువుల్లో పాల ఉత్పత్తిని మరింత పెంచే గడ్డి

image

పశువుల్లో పాల ఉత్పత్తి పెరిగేందుకు చాలా మంది పాడి రైతులు సూపర్ నేపియర్ పశుగ్రాసం వాడుతున్నారు. ఇప్పుడు దీన్ని మించి అధిక ప్రొటీన్ శాతం కలిగి, పాల దిగుబడిని మరింత పెంచే ‘4G బుల్లెట్ సూపర్ నేపియర్’ పశుగ్రాసం అందుబాటులోకి వచ్చింది. నేపియర్‌తో పోలిస్తే ఇది చాలా మృదువుగా, 10-13 అడుగుల ఎత్తు పెరిగి, ఎకరాకు 200 టన్నుల దిగుబడినిస్తుంది. దీన్ని ఎలా సాగు చేయాలో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.