News October 13, 2025

వికారాబాద్ జిల్లాలో కానరాని టాస్క్‌ఫోర్స్ దాడులు

image

వికారాబాద్ జిల్లాలో ఒకప్పుడు టాస్క్‌ఫోర్స్ అంటే అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టేది. కానీ, ఇప్పుడు జిల్లాలో ఒక్కసారిగా టాస్క్‌ఫోర్స్ సైలెంట్ కావడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. గతంలో జిల్లాలో రేషన్ బియ్యం, ఇసుక, గుట్కా, నకిలీ పదార్థాలపై దాడులు నిర్వహించిన ఫోర్స్ ఇప్పుడు ఒక్కసారిగా కామ్ అయిపోయింది. జిల్లాలో టాస్క్‌ఫోర్స్ బృందాలు దాడులు చేయకుండా రాజకీయ నేతలు అడ్డుపడుతున్నారని ప్రజలు అంటున్నారు.

Similar News

News October 13, 2025

గ్రీన్ ఫీల్డ్ హైవేతో పల్నాడు జిల్లాకు మహర్దశ

image

హైదరాబాదు నుంచి పల్నాడు జిల్లా మీదగా అమరావతిని కలుపుతూ గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రతిపాదనలు కార్యరూపం దాల్చే అవకాశం ఉండడంతో పల్నాడు జిల్లాకు మహర్దశ పట్టనుంది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుంచి ఏపీలోని బందర్ పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవేకు కేంద్ర ప్రభుత్వం డిపిఆర్ సిద్ధం చేసింది. టీఎస్‌లోని హాలియా, అడవిదేవరపల్లి, వజీరాబాద్ నుంచి ఏపీలోని దైద, దాచేపల్లి, ముత్యాలంపాడు మీదగా హైవేను ప్రతిపాదించారు.

News October 13, 2025

ఓట్ చోరీ ఆరోపణలపై పిల్.. తిరస్కరించిన సుప్రీం

image

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ‘ఓట్ చోరీ’ ఆరోపణలపై దాఖలైన PILను సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది. ఓట్ చోరీ అంశంపై దర్యాప్తుకు SIT ఏర్పాటు చేయాలన్న అడ్వకేట్ రోహిత్ పాండే విజ్ఞప్తిని తిరస్కరించింది. దీనిపై ECని పిటిషనర్ సంప్రదించవచ్చని చెప్పింది. అయితే ఎలక్షన్ కమిషన్‌ను గతంలో ఆశ్రయించినా చర్యలు తీసుకోలేదని ఆయన బదులిచ్చారు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరించాలని సూచిస్తూ PILను SC డిస్మిస్ చేసింది.

News October 13, 2025

చేవెళ్ల మాజీ ఎమ్మెల్యేకు జర్నలిజం మీద మక్కువ

image

చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి వృద్ధాప్య సమస్యలతో HYDలోని అపోలో ఆస్పత్రిలో తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన జీవితాంతంల కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. 2 సార్లు హైదరాబాద్ ఎంపీగా పోటీ చేసిన ఆయన జర్నలిజంపై మక్కువతో న్యూస్ సర్వీస్ సిండికేట్ సంస్థను స్థాపించారు. మరికాసేపట్లో జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానానికి అంతిమయాత్ర జరగనుంది.