News October 13, 2025
గూడూరు మండలంలో భూప్రకంపనలు అంటూ పుకార్లు?

గూడూరు మండల కేంద్రంలో ఆదివారం రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుంది. కాగా మండలంలో రాత్రి ఒంటి గంట సమయంలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం పడింది. దీంతో ఇదేసమయంలో కొందరు స్వల్ప భూప్రకంపనలు వచ్చినట్లు SMలో పుకార్లు సృష్టించారు. భూప్రకంపనలు నిజం కాదని స్థానికులు తెలిపారు.
Similar News
News October 13, 2025
కాంతార చాప్టర్-1: రిషబ్ కష్టం చూశారా?

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార చాప్టర్-1’ భారీ కలెక్షన్లు రాబడుతోంది. క్లైమాక్స్ చిత్రీకరణ సమయంలో తన కాళ్లు వాచిపోయాయని, శరీరం అలసిపోయిందంటూ ఫొటోలను రిషబ్ Xలో షేర్ చేశారు. ఈ కష్టం వల్లే క్లైమాక్స్ అభిమానులు ఆరాధించే స్థాయికి వెళ్లిందన్నారు. తాను నమ్మిన దైవశక్తి ఆశీర్వాదంతో ఇది సాధ్యమైందని తెలిపారు. తమకు మద్దతు ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.
News October 13, 2025
ఎచ్చెర్ల: RBK నిర్మాణంపై కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు

ఎచ్చెర్ల మండలం, బడివానిపేట గ్రామంలో నిర్మించ తలపెట్టిన RBK కేంద్రంతో చిన్నపిల్లలు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సోమవారం జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన గ్రీవెన్స్‌లో ఫిర్యాదు అందింది. గ్రామస్థులు ఈ సమస్యను అధికారులకు వివరించారు. నిర్మాణంలో భాగంగా పిల్లర్స్ వేసి ఉంచడంతో 48 మంది కుటుంబాలకు చెందిన పిల్లలు అక్కడ ఆడుకుంటారని, దీంతో ప్రమాదాలు చేసుకుంటున్నాయని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
News October 13, 2025
గ్రీన్ ఫీల్డ్ హైవేతో పల్నాడు జిల్లాకు మహర్దశ

హైదరాబాదు నుంచి పల్నాడు జిల్లా మీదగా అమరావతిని కలుపుతూ గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రతిపాదనలు కార్యరూపం దాల్చే అవకాశం ఉండడంతో పల్నాడు జిల్లాకు మహర్దశ పట్టనుంది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుంచి ఏపీలోని బందర్ పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవేకు కేంద్ర ప్రభుత్వం డిపిఆర్ సిద్ధం చేసింది. టీఎస్‌లోని హాలియా, అడవిదేవరపల్లి, వజీరాబాద్ నుంచి ఏపీలోని దైద, దాచేపల్లి, ముత్యాలంపాడు మీదగా హైవేను ప్రతిపాదించారు.