News October 13, 2025

యాదాద్రి: భారీ వర్షం.. తడిసిన ధాన్యం

image

జిల్లా కేంద్రంలో గత కొద్ది రోజులుగా ఎండలు మండిపోతున్న తరుణంలో, సోమవారం తెల్లవారుజామున ఊహించని విధంగా భారీ వర్షం దంచికొట్టింది. దీంతో ఐకేపీ కొనుగోలు కేంద్రాలలో ఆరబోసిన వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దైంది. వరికోతలు ముమ్మరంగా సాగుతున్న వేళ, ధాన్యాన్ని మార్కెట్‌కు చేర్చి ఆముదం అనుకుంటున్న సమయంలో వర్షం రావడంతో రైతులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News October 13, 2025

కాంతార చాప్టర్-1: రిషబ్ కష్టం చూశారా?

image

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార చాప్టర్-1’ భారీ కలెక్షన్లు రాబడుతోంది. క్లైమాక్స్ చిత్రీకరణ సమయంలో తన కాళ్లు వాచిపోయాయని, శరీరం అలసిపోయిందంటూ ఫొటోలను రిషబ్ Xలో షేర్ చేశారు. ఈ కష్టం వల్లే క్లైమాక్స్ అభిమానులు ఆరాధించే స్థాయికి వెళ్లిందన్నారు. తాను నమ్మిన దైవశక్తి ఆశీర్వాదంతో ఇది సాధ్యమైందని తెలిపారు. తమకు మద్దతు ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.

News October 13, 2025

ఎచ్చెర్ల: RBK నిర్మాణంపై కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు

image

ఎచ్చెర్ల మండలం, బడివానిపేట గ్రామంలో నిర్మించ తలపెట్టిన RBK కేంద్రంతో చిన్నపిల్లలు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సోమవారం జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన గ్రీవెన్స్‌లో ఫిర్యాదు అందింది. గ్రామస్థులు ఈ సమస్యను అధికారులకు వివరించారు. నిర్మాణంలో భాగంగా పిల్లర్స్ వేసి ఉంచడంతో 48 మంది కుటుంబాలకు చెందిన పిల్లలు అక్కడ ఆడుకుంటారని, దీంతో ప్రమాదాలు చేసుకుంటున్నాయని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

News October 13, 2025

గ్రీన్ ఫీల్డ్ హైవేతో పల్నాడు జిల్లాకు మహర్దశ

image

హైదరాబాదు నుంచి పల్నాడు జిల్లా మీదగా అమరావతిని కలుపుతూ గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రతిపాదనలు కార్యరూపం దాల్చే అవకాశం ఉండడంతో పల్నాడు జిల్లాకు మహర్దశ పట్టనుంది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుంచి ఏపీలోని బందర్ పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవేకు కేంద్ర ప్రభుత్వం డిపిఆర్ సిద్ధం చేసింది. టీఎస్‌లోని హాలియా, అడవిదేవరపల్లి, వజీరాబాద్ నుంచి ఏపీలోని దైద, దాచేపల్లి, ముత్యాలంపాడు మీదగా హైవేను ప్రతిపాదించారు.