News October 13, 2025

రాయుడు ఎపిసోడ్.. MLA ఏమంటారో?

image

సొంత పార్టీ మహిళా నేత<<17990235>> వినుతకోట<<>>కు అన్యాయం జరుగుతున్నా పార్టీ అధ్యక్షుడు పవన్ పట్టించుకోలేదని YCP ఆరోపించింది. ఆమెకు ఆ పార్టీ మరోనేత హరిప్రసాద్‌ నుంచి కూడా మొండి చెయ్యి ఎదురైనట్లు సమాచారం. మరోవైపు ఈ మొత్తం వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న MLA బొజ్జలపై అధిష్ఠానం చర్యలు తీసుకుంటుందా అనే చర్చ మొదలైంది. కాగా ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే ఎలా స్పందిస్తారో చూడాలి.

Similar News

News October 13, 2025

ధర్నాలు, ర్యాలీలకు అనుమతి తప్పనిసరి: DSP

image

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా నవంబర్ 11 వరకు సెక్షన్ 30 పోలీసు చట్టం అమలులో ఉందని ఇన్‌‌ఛార్జ్ డీఎస్పీ ఆర్.గోవిందరావు తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టరాదని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ప్రజలు శాంతియుతంగా వ్యవహరించి, పోలీసు అనుమతులతోనే కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

News October 13, 2025

జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్‌గా బాధ్యతల స్వీకరణ

image

విజయనగరంలోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ నూతన వైస్ ఛాన్సలర్‌గా వి.వెంకట సుబ్బారావు తన కార్యాలయంలో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన నెహ్రూ, మహాకవి గురజాడ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. విశ్వవిద్యాలయ సిబ్బంది వెంకట సుబ్బారావుకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.

News October 13, 2025

ఏపీ అప్‌డేట్స్

image

☛ లిక్కర్ స్కామ్ కేసు నిందితులకు ఈ నెల 16 వరకు రిమాండ్ పొడిగింపు.. న్యూయార్క్ వెళ్లేందుకు MP మిథున్ రెడ్డి వేసిన పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా.. కౌంటర్ దాఖలు చేయాలని సిట్‌కు కోర్టు ఆదేశం
☛ రేపు, ఎల్లుండి రాజస్థాన్ ఉదయ్‌పుర్‌లో మంత్రి దుర్గేశ్ పర్యటన.. నేషనల్ టూరిజం కాన్ఫరెన్స్‌లో పాల్గొననున్న మంత్రి
☛ పశుసంవర్ధక శాఖలో 157 మంది ల్యాబ్ టెక్నీషియన్ల కాంట్రాక్టు సర్వీసులు మరో ఏడాది పాటు పొడిగింపు