News October 13, 2025
రాజన్న ఆలయ వివాదం.. KTR ఎక్కడా..?

వేములవాడ రాజన్న దర్శనాలపై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల MLA KTR మౌనంగా ఉండడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఓట్లు తప్ప మా మనోభావాలు మీకు పట్టవా సార్.. అంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఆలయ వివాదంపై BRS ఇప్పటికీ ఎలాంటి స్టాండ్ తీసుకోకపోవడాన్ని తప్పుబడుతున్నారు. కాగా, ఈ అంశంలో <<17985763>>BJPనేమో ధర్నాలతో రోడ్డెక్కింది. <<>>దీంతో స్వామివారి దర్శనాల వివాదం BJP VS CONGగా మారింది.
Similar News
News October 13, 2025
ఎకనామిక్ సైన్సెస్‌లో ముగ్గురికి నోబెల్

ఎకనామిక్ సైన్సెస్‌లో జోయెల్ మోకైర్, ఫిలిప్ అగియోన్, పీటర్ హోయిట్‌ను నోబెల్ ప్రైజ్ వరించింది. ఇన్నోవేషన్ ఆధారిత ఎకనామిక్ గ్రోత్‌ను వివరించినందుకు గాను వారికి ఈ పురస్కారం దక్కింది. ప్రైజ్‌లో మోకైర్‌కు అర్ధభాగం, అగియోన్, పీటర్‌కు సంయుక్తంగా మరో అర్ధభాగాన్ని రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. ఇప్పటికే కెమిస్ట్రీ, ఫిజిక్స్, మెడిసిన్, <<17966688>>పీస్<<>>, లిటరేచర్ అవార్డులు ప్రకటించడం తెలిసిందే.
News October 13, 2025
ప్రజావాణికి 88 ఫిర్యాదులు: NZB అదనపు కలెక్టర్

నిజామాబాద్ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 88 ఫిర్యాదులు వచ్చాయని అదనపు కలెక్టర్ అంకిత్ తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్‌లు అంకిత్, కిరణ్ కుమార్‌తో పాటు డీఆర్డీఓ సాయాగౌడ్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, బోధన్ ఏసీపీ శ్రీనివాస్‌లకు అందజేశారు.
News October 13, 2025
స్త్రీనిధి రుణ వాయిదా వివరాల పోస్టర్ ఆవిష్కరణ

స్త్రీనిధి రుణ వాయిదా వివరాలు ఉన్న పోస్టర్‌ను కలెక్టర్ డా.వెంకటేశ్వర్ సోమవారం తన ఛాంబర్‌లో ఆవిష్కరించారు. అనంతరం DRDA అదనపు PD డా.ప్రభావతి మాట్లాడుతూ.. ఈ పోస్టర్‌లో చూపిన విధంగా స్త్రీనిధి రుణ వాయిదాలను యాప్ ద్వారా డిజిటల్ పేమెంట్ చేయాలని కోరారు. కార్యక్రమంలో స్త్రీనిధి AGM హేమంత్ కుమార్, LDM రవి కుమార్, స్త్రీనిధి మేనేజర్లు పాల్గొన్నారు.