News October 13, 2025
HYD: గులాబీ దళానికి డ్యామేజ్ తప్పదా!

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ ఎన్నికలో ఓ విషయం BRSకి కొరకరాని కొయ్యగా మారింది. తెలంగాణ రక్షణ సమితి- డెమోక్రటిక్ (TRS- D) పార్టీ తన అభ్యర్థిని బరిలో దింపింది. పేరు, జెండా దాదాపు ఒకేలా ఉండటం.. BRSగా పేరు మారినప్పటికీ చాలా మంది TRSగానే పిలుస్తుండటంతో డ్యామేజ్ తప్పదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కార్యకర్తల్లో భరోసా నింపాలన్నా ఈ బైపోల్ కీలకంగా మారనుంది.
Similar News
News October 13, 2025
ప్రజావాణికి 88 ఫిర్యాదులు: NZB అదనపు కలెక్టర్

నిజామాబాద్ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 88 ఫిర్యాదులు వచ్చాయని అదనపు కలెక్టర్ అంకిత్ తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్‌లు అంకిత్, కిరణ్ కుమార్‌తో పాటు డీఆర్డీఓ సాయాగౌడ్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, బోధన్ ఏసీపీ శ్రీనివాస్‌లకు అందజేశారు.
News October 13, 2025
స్త్రీనిధి రుణ వాయిదా వివరాల పోస్టర్ ఆవిష్కరణ

స్త్రీనిధి రుణ వాయిదా వివరాలు ఉన్న పోస్టర్‌ను కలెక్టర్ డా.వెంకటేశ్వర్ సోమవారం తన ఛాంబర్‌లో ఆవిష్కరించారు. అనంతరం DRDA అదనపు PD డా.ప్రభావతి మాట్లాడుతూ.. ఈ పోస్టర్‌లో చూపిన విధంగా స్త్రీనిధి రుణ వాయిదాలను యాప్ ద్వారా డిజిటల్ పేమెంట్ చేయాలని కోరారు. కార్యక్రమంలో స్త్రీనిధి AGM హేమంత్ కుమార్, LDM రవి కుమార్, స్త్రీనిధి మేనేజర్లు పాల్గొన్నారు.
News October 13, 2025
జగిత్యాల: విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

OCT 21న పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఆన్‌లైన్ వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ పోటీలు తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ఉంటాయని, 6వ తరగతి నుంచి PG విద్యార్థులు ఇందులో పాల్గొనవచ్చన్నారు. “Drugs Menace: Role Of Police In Prevention And How Students Can Stay Away From Drugs” అంశంపై ఈనెల 28లోగా వ్యాసాలు సమర్పించాలన్నారు. SHARE IT.