News October 13, 2025

గాజాలో మొదలైన బందీల విడుదల

image

గాజాలో హమాస్ చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరుల విడుదల మొదలైంది. తొలుత ఏడుగురిని రెడ్ క్రాస్‌కు హమాస్ అప్పగించింది. త్వరలో మరికొందరిని రిలీజ్ చేయనుంది. మరోవైపు తమ వారికి స్వాగతం పలికేందుకు కుటుంబ సభ్యులు ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌లో ఎదురుచూస్తున్నారు. పీస్ డీల్ కుదర్చడంలో కీలకంగా వ్యవహరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ధన్యవాదాలు చెబుతూ నగరంలో భారీగా సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు.

Similar News

News October 13, 2025

టాటా మెమోరియల్ సెంటర్‌లో 78 ఉద్యోగాలు

image

టాటా మెమోరియల్ సెంటర్‌ హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్ (పంజాబ్)‌లో 78 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈనెల 27 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి జనరల్ నర్సింగ్ & మిడ్ వైఫరీ, అంకాలజీ నర్సింగ్ డిప్లొమా, బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్‌తో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. https://tmc.gov.in/

News October 13, 2025

గొడవైందా? మరి ఆ తర్వాత..

image

గొడవల్లేకుండా ఏ బంధం ఉండదు. ముఖ్యంగా దంపతుల మధ్య కలహాలు సాధారణం. అయితే వీటి వల్లే ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోవడం, ఆ బంధం స్ట్రాంగ్‌గా మారుతుందని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా గొడవైన తర్వాత భాగస్వామి వెంటనే సారీ చెప్పాలని ఆశించకండి. వారికి ఆలోచించుకోవడానికి కాస్త సమయం ఇవ్వాలి. ఒకరినొకరు నిందించుకోకూడదు. అలాగే గొడవ ఎందుకు జరిగింది, ఆ సమయంలో ఎవరు ఎలా ప్రవర్తించారు అన్నవి కూడా చర్చించుకోవాలి.

News October 13, 2025

రెండో టెస్టు.. భారత్ టార్గెట్ ఎంతంటే?

image

రెండో టెస్టులో ఫాలో ఆన్ ఆడిన వెస్టిండీస్ 390 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ క్యాంప్‌బెల్(115), షై హోప్(103) సెంచరీలు చేశారు. చివరి వికెట్‌కు గ్రీవ్స్(50*), సీల్స్ (32) అద్భుతంగా పోరాడి 79 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో WI భారత్ ముందు 121 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. భారత బౌలర్లలో కుల్దీప్, బుమ్రా చెరో 3, సిరాజ్ 2 వికెట్లు తీశారు.