News October 13, 2025
ఏలేశ్వరం: గోతుల దారిలో ఊడిన ఆర్టీసీ బస్సు టైర్

ఏలేశ్వరం మండలం రమణయ్యపేట నుంచి రాజవొమ్మంగి మండలంలోని చెరుకుంపాలెం వరకు రోడ్డు అద్వాన్నంగా ఉన్న విషయం తెలిసిందే. సోమవారం రాజవొమ్మంగి నుంచి ఏలేశ్వరం వెళుతున్న ఆర్టీసీ బస్సు టైర్ బోర్నగూడెం వద్ద ఊడిపోయింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. రోడ్డు దారుణంగా ఉండడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News October 13, 2025
PDPL: పోలీస్ సిబ్బందికి కిట్ల పంపిణీ

రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా పోలీస్ సిబ్బందికి ఉన్ని దుప్పటి, వులెన్ జాకెట్, టీ- షర్ట్, రెయిన్‌కోట్, హవర్ సాక్స్ పంపిణీ చేశారు. వాతావరణ మార్పులు, క్షేత్రస్థాయి కష్టాలను దృష్టిలో ఉంచుకొని సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు CUP తెలిపారు. వ్యక్తిగత, కుటుంబ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఆయన సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు DCP శ్రీనివాస్, RIలతో పాటు పలువురు పాల్గొన్నారు.
News October 13, 2025
సచివాలయ ఉద్యోగుల పదోన్నతులపై క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు

AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతులపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పదోన్నతుల కల్పనపై అధ్యయనం చేసేందుకు 10 మంది మినిస్టర్లతో క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో డిప్యూటీ సీఎం పవన్‌తో పాటు మంత్రులు అచ్చెన్నాయుడు, అనిత, నారాయణ, DSBV స్వామి, అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, సత్యకుమార్, గొట్టిపాటి రవి కుమార్, సంధ్యారాణి సభ్యులుగా ఉన్నారు.
News October 13, 2025
PDPL: 6 నెలల్లో పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

పెద్దపల్లి తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో నిర్మాణం జరుగుతున్న జడ్పీ కాంప్లెక్స్ పనులను కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులతో కలిసి సోమవారం పరిశీలించారు. ఆరు నెలల్లో నాణ్యతతో పనులు పూర్తిచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులపై ఇంజినీరింగ్ అధికారులు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. ఈ సందర్బంగా ZP సీఈఓ నరేందర్, EE గిరీష్ బాబు, తహశీల్దార్ రాజయ్య, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.