News October 13, 2025
HYD: జాగ్రత్త! HSRP పేరుతో మోసాలు!

హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ బిగించుకోలేదంటూ ఇటీవల క్యాబ్ డ్రైవర్లకు నకిలీ ఆర్టీఏ చలాన్ కాల్స్ వస్తున్నాయి. మీకు రూ.3,400 జరిమానా పడిందని మోసగాళ్లు చెబుతున్నారు. దీనిపై ఆందోళన చెందిన ఓ డ్రైవర్ స్థానిక అధికారులను సంప్రదించగా, అది నకిలీ కాల్ అని తేలింది. HSRP సంబంధించి ఎలాంటి తుది గడువును ఇప్పటివరకు ప్రభుత్వం విధించలేదని అధికారులు స్పష్టం చేశారు.
Similar News
News October 13, 2025
రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

TG: సీఎం రేవంత్ రెడ్డి రేపు ఉదయం 9 గంటలకు ఢిల్లీకి వెళ్లనున్నారు. బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు విధించిన స్టేను ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని నిర్ణయించింది. ఇదే విషయమై సీనియర్ లాయర్లతో రేవంత్ భేటీ కానున్నారు. కోర్టులో వాదించాల్సిన అంశాలపై వారితో చర్చించనున్నారు.
News October 13, 2025
కరీంనగర్: ప్రజావాణికి 271 దరఖాస్తులు

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. 271 అర్జీలు రాగా సత్వర పరిష్కారం కోసం వాటిని వివిధ శాఖల అధికారులకు బదిలీ చేశారు. పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అ.కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మునిసిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు, RDOలు పాల్గొన్నారు.
News October 13, 2025
బెల్లంపల్లి: కబ్జాల నుంచి ప్రభుత్వ భూములను కాపాడండి

బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూములను కబ్జాల నుంచి కాపాడాలని మాజీ సర్పంచి అనిత కోరారు. ప్రజావాణిలో కలెక్టర్ దీపక్ కుమార్ వినతిపత్రం అందజేశారు. రాత్రికి రాత్రి చదును చేయించి ప్లాట్లుగా విభజించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని వాపోయారు. అక్రమ నిర్మాణాలకు ఇంటి నంబర్లు, కరెంటు మీటర్లు ఇచ్చి రూ.కోట్లకు అమ్ముకుంటున్నారని కలెక్టర్‌కు వివరించారు.