News October 13, 2025

నగలు నల్లగా మారాయా? ఇలా చేయండి

image

పండుగలు వస్తే చాలు మహిళలు భద్రంగా దాచుకున్న నగలను ఒక్కోటి బయటకు తీస్తారు. కానీ కొన్నిసార్లు ఈ నగలు నల్లగా మారి, మెరుపు తగ్గుతాయి. దీనికోసం కొన్ని టిప్స్ పాటించండి. * వేడినీటిలో డిష్‌వాష్ లిక్విడ్/ షాంపూ వేసి నగలను నానబెట్టాలి. తర్వాత బ్రష్‌తో తోమితే మెరుపు తిరిగొస్తుంది. * బంగారుగాజులను నీటిలో నానబెట్టాలి. శనగపిండిలో వెనిగర్ కలిపి, మెత్తని పేస్టులా చేసి గాజులకు పట్టించి, కాసేపటి తర్వాత కడిగేయాలి.

Similar News

News October 13, 2025

రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

image

TG: సీఎం రేవంత్ రెడ్డి రేపు ఉదయం 9 గంటలకు ఢిల్లీకి వెళ్లనున్నారు. బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు విధించిన స్టేను ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని నిర్ణయించింది. ఇదే విషయమై సీనియర్ లాయర్లతో రేవంత్ భేటీ కానున్నారు. కోర్టులో వాదించాల్సిన అంశాలపై వారితో చర్చించనున్నారు.

News October 13, 2025

చిన్న చిన్న కాంట్రాక్టుల కోసం ఆశపడను: మంత్రి పొంగులేటి

image

TG: మంత్రి కొండా సురేఖతో <<17994511>>విభేదాలంటూ<<>> జరుగుతున్న ప్రచారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. ‘చిన్న చిన్న కాంట్రాక్టుల కోసం ఆశపడను. నాపై కొండా సురేఖ ఫిర్యాదు చేశారని అనుకోవడం లేదు. ఈరోజు పర్యటనకు ఆమె రాకపోవడానికి చెప్పుకోదగ్గ కారణాలేవీ లేవు. అందరూ అన్ని సార్లు ఉండాలనేం లేదు. వచ్చే పర్యటనలో అక్కలు అందరూ ఉంటారు’ అని మేడారం పర్యటనలో వ్యాఖ్యానించారు.

News October 13, 2025

సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు హెల్త్ చెకప్‌లు: సీఎం రేవంత్

image

TG: సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, విద్యార్థులకు హెల్త్ చెకప్ చేయాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. ‘విద్యార్థులు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ పరిధిలోకి తేవాలి. భోజనం క్వాలిటీ చెక్‌ చేసేందుకు టెక్నాలజీ వాడాలి. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు ప్రత్యేక విధానం అనుసరించాలి. హాస్టళ్లను మెడికల్ కాలేజీలు, CHCతో లింక్ చేయాలి’ అని సూచించారు.