News October 13, 2025
జగిత్యాల: స్కాలర్షిప్స్.. 3 రోజులే ఛాన్స్..!

BD కార్మికుల పిల్లల స్కాలర్షిప్ దరఖాస్తుల గడువు ఈనెల 15తో ముగుస్తుందని BD కార్మికుల దవాఖాన వైద్యాధికారి డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. బీడీ కార్మికుల పిల్లలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఆన్లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఈ పథకానికి అర్హులని పేర్కొన్నారు. కాగా, సెప్టెంబర్ 30తో గడువు ముగియాల్సి ఉండగా మరోసారి లాస్ట్ డేట్‌ను 15కు పొడిగించారు.
Similar News
News October 13, 2025
మక్తల్: క్షుద్ర పూజల కలకలం

మక్తల్ మండల పరిధిలోని మధ్వార్ గ్రామం వెలుపల మూడుదారుల కలిసిన ప్రదేశంలో ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించారు. రాతి గుండ్ల సమీపంలో నిమ్మకాయలు, గుమ్మడికాయ, పసుపు, కుంకుమతో పాటు నల్ల మేకపోతును బలి ఇచ్చినట్లు స్థానికులు తెలిపారు. దీంతో రోడ్డంతా రక్తంతో తడిసి భయానకంగా మారింది. ఈ దృశ్యం గమనించిన గ్రామస్థులు కొంతసేపు ఆ మార్గంలో రాకపోకలు నిలిపివేశారు. విషయం ఆరా తీస్తున్నారు.
News October 13, 2025
HYD: అబ్బాయిలపై లైంగిక దాడి.. నిందితుడి ARREST

HYD సైదాబాద్ <<17990748>>బాలసదన్‌లో లైంగిక దాడి<<>> జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనపై ఓ బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు రెహమాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఐదుగురు అబ్బాయిలకు పోలీసులు వైద్య పరీక్షలను చేయించనున్నారు. కాగా ఈ ఘటనపై మహిళా శిశు సంక్షేమ శాఖ కూడా సీరియస్‌గా స్పందించింది.
News October 13, 2025
భూపాలపల్లి: బయోమెట్రిక్ ఆధారంగా వేతనాలు చెల్లించాలి: కలెక్టర్

భూపాలపల్లి జిల్లాలో ప్రభుత్వ అన్ని శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగులకు బయోమెట్రిక్ అటెండెన్స్ ఆధారంగా జీతాలు చెల్లించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో సంక్షేమ కార్యక్రమాలు పరిశీలన, ముందస్తు అనుమతులు లేకుండా సెలవులు వినియోగం తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు. ప్రతి శాఖాధికారి ముందస్తు అనుమతి లేకుండా సెలవులలో వెళ్లరాదని సూచించారు.