News October 13, 2025

మెదక్: వరికి తెగులు.. రైతులకు గుబులు

image

మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇటీవల జరిగిన వాతావరణ మార్పుల కారణంగా పలు గ్రామాల్లో వరి పంటకు కోత దశలో తెగులు సోకింది. మెడ విరుపు, కంకి నల్లి, దోమపోటు సోకి జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇదివరకు వర్షాల కారణంగా చాలా వరకు నష్టపోయిన రైతులు తెగులు కారణంగా పూర్తి దశలో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టిన పెట్టుబడి తెగుల కారణంగా ఏరులో వేసినట్లుగా ఉందన్నారు.

Similar News

News October 13, 2025

విశాఖలో నిషేధిత కాఫ్ సిరప్స్ స్వాధీనం

image

డ్రగ్స్‌కంట్రోల్ విభాగం అధికారులు మర్రిపాలెంలో రూ.4.5లక్షల విలువైన 5,900 Rivicold కోల్డ్/కాఫ్ సిరప్స్ స్వాధీనం చేసుకున్నారు. 4ఏళ్లలోపు పిల్లలకు వాడకాన్ని ప్రభుత్వం నిషేధించిన ఈ సిరప్స్‌ను బజాజ్ ఫార్మ్యులేషన్స్ (ఉత్తరాఖండ్) తయారు చేసింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్.విజయ్‌కుమార్ పర్యవేక్షణలో డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఎం.శ్రీనివాస్‌రావు చర్యలు చేపట్టారు.

News October 13, 2025

NGKL: ఆకస్మిక మరణాలను నియంత్రించేందుకే సీపీఆర్

image

ఆకస్మిక మరణాలను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ సీపీఆర్ నిర్వహించే విధానాలను తెలుసుకోవాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. సీపీఆర్‌ (కార్డియో పల్మనరీ రిససిటేషన్) పై అవగాహన కల్పించేందుకు సోమవారం కలెక్టరేట్‌ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ శివకుమార్‌ జిల్లా అధికారులకు సీపీఆర్‌ ప్రక్రియను వివరంగా చూపించారు.

News October 13, 2025

HYD: ఒకే ఇంట్లో 43 ఓట్లు.. విచారణకు ఆదేశం

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటర్ జాబితాపై అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓట్ చోరీ అంటూ వచ్చిన ఆరోపణలపై ఎన్నికల అధికారి విచారణకు ఆదేశించారు. యూసుఫ్‌గూడ డివిజన్ కృష్ణానగర్‌లోని 8-3-231/బీ/160 ఇంట్లో ఇటీవల 43 ఓట్లు నమోదయ్యాయి. దీనిని సుమోటోగా స్వీకరించిన జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ విచారణకు ఆదేశించారు.