News October 13, 2025

అక్కడి అమ్మాయి.. ఇక్కడి అబ్బాయి.!

image

మనసిచ్చిన ప్రేమికుడి కోసం ఖండాలు దాటొచ్చింది ఈ మగువ. చంద్రగిరి(M) శేషాపురానికి చెందిన శివసాయి మురారీ జర్మనీలోని ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. అక్కడే పోలాండ్ దేశానికి చెందిన గోర్జాత్ పని చేస్తోంది. వీరి మధ్య ఏర్పడ్డ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇంకేముంది.. పెద్దలను ఒప్పించి ఒక్కటయ్యారు. శనివారం రాత్రి కాశిపెంట్ల వద్ద వీరి వివాహం వైభవంగా జరిగింది.

Similar News

News October 13, 2025

HYD: ఒకే ఇంట్లో 43 ఓట్లు.. విచారణకు ఆదేశం

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటర్ జాబితాపై అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓట్ చోరీ అంటూ వచ్చిన ఆరోపణలపై ఎన్నికల అధికారి విచారణకు ఆదేశించారు. యూసుఫ్‌గూడ డివిజన్ కృష్ణానగర్‌లోని 8-3-231/బీ/160 ఇంట్లో ఇటీవల 43 ఓట్లు నమోదయ్యాయి. దీనిని సుమోటోగా స్వీకరించిన జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ విచారణకు ఆదేశించారు.

ఫిట్‌నెస్‌కి సారా టిప్స్ ఇవే..

image

ప్రస్తుతకాలంలో వివిధ కారణాల వల్ల బరువు పెరిగేవారి సంఖ్య పెరిగింది. సారాఆలీఖాన్ కూడా మొదట్లో ఆ బాధితురాలే. ఒకప్పుడు బరువుగా ఉండే ఈమె ప్రస్తుతం ఎంతో ఫిట్‌గా మారారు. దీనికోసం ఎక్కువగా లీన్ ప్రోటీన్లు, కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు తీసుకున్నానని సారా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. రెగ్యులర్‌ యోగా, వ్యాయామం, మెడిటేషన్ చేయడం, ఎక్కువగా నీళ్లు తాగడంతో పాటు తగినంత నిద్రపోవడం కూడా తన ఆరోగ్యానికి కారణమంటున్నారామె.