News October 13, 2025

కాజీపేటలో వందే భారత్ స్లీపర్ కోచ్‌ల తయారీ కేంద్రం..!

image

కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో వందే భారత్ స్లీపర్ రైళ్లను తయారు చేయాలని రైల్వే బోర్డు ఆలోచిస్తోంది. వివిధ రాష్ట్రాల నుంచి వందే భారత్ స్లీపర్ కోచ్‌లు కావాలని డిమాండ్ పెరుగుతుండటంతో కేంద్రంఈ ఆలోచన చేస్తోంది. దీనికోసం KZPT కోచ్ ఫ్యాక్టరీని కేటాయించాలని నిర్ణయించినట్లు తెలిసింది. వీలైనంత తొందరలో 200 భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. దీంతో KZPTకు అరుదైన గౌరవం దక్కనుంది.

Similar News

News October 13, 2025

రేపు చరిత్ర సృష్టించబోతున్నాం: మంత్రి లోకేశ్

image

AP: రాష్ట్ర ప్రభుత్వంతో గూగుల్ సంస్థ రేపు MOU చేసుకోబోతోందని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. ‘2024 OCTలో USలోని Google ఆఫీసును సందర్శించా. ఏడాదిపాటు చర్చలు, కృషి తర్వాత రేపు చరిత్ర సృష్టించబోతున్నాం. టెక్ దిగ్గజాల్లో ఒక్కటైన గూగుల్ మన ఏపీకి వస్తోంది. ఈ 1GW ప్రాజెక్టు విలువ 10 బిలియన్ డాలర్లు. ఇది గేమ్ ఛేంజింగ్ ఇన్వెస్ట్‌మెంట్. రాష్ట్ర డిజిటల్ భవిష్యత్తు, ఇన్నోవేషన్‌కు ముందడుగు’ అని పేర్కొన్నారు.

News October 13, 2025

కామారెడ్డి: ప్రజావాణికి 90 ఫిర్యాదులు

image

కామారెడ్డిలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 90 ఫిర్యాదులు వచ్చినట్లు అదనపు కలెక్టర్ చందర్ నాయక్ తెలిపారు. సోమవారం కామారెడ్డి కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించినట్లు చెప్పారు. వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో పార్థసింహారెడ్డి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ పాల్గొన్నారు.

News October 13, 2025

పార్వతీపురం పీజీఆర్ఎస్‌కు 112 వినతులు

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన సమస్యలను సత్వరమే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ ఆధ్వర్యంలో సోమవారం పిజిఆర్ఎస్ నిర్వహించారు. 112 మంది అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు. సమస్యలు సత్వరమే పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు