News October 13, 2025
విద్యాసంస్థల్లో రేపు డ్రై డే: సిద్దిపేట కలెక్టర్

దోమలు వృద్ధి చెందకుండా అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలలో ఈ నెల 14న ప్రత్యేక డ్రైడే నిర్వహించాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. వర్షాల ప్రభావంతో దోమలు అధికంగా వృద్ధిచెంది విద్యార్థులపై ప్రభావం చూపకుండా అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలో కార్యక్రమం నిర్వహించాలన్నారు.
Similar News
News October 13, 2025
ఎన్‌సీడీ స్క్రీనింగ్ త్వరగా పూర్తి చేయాలి: డీఎంహెచ్‌ఓ

భద్రాద్రి జిల్లాలో సంక్రమణ రహిత వ్యాధుల (నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ – ఎన్‌సీడీ) స్క్రీనింగ్ కార్యక్రమాలను సమయానికి పూర్తి చేయాలని డీఎంహెచ్‌ఓ ఎస్. జయలక్ష్మి అధికారులను ఆదేశించారు. సోమవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. స్క్రీనింగ్ నిర్వహించి, ఆన్‌లైన్ డేటాను ఆలస్యం లేకుండా నమోదు చేయాలని ఆమె సూచించారు.
News October 13, 2025
ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు డా.శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డిలతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
News October 13, 2025
రేపు చరిత్ర సృష్టించబోతున్నాం: మంత్రి లోకేశ్

AP: రాష్ట్ర ప్రభుత్వంతో గూగుల్ సంస్థ రేపు MOU చేసుకోబోతోందని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. ‘2024 OCTలో USలోని Google ఆఫీసును సందర్శించా. ఏడాదిపాటు చర్చలు, కృషి తర్వాత రేపు చరిత్ర సృష్టించబోతున్నాం. టెక్ దిగ్గజాల్లో ఒక్కటైన గూగుల్ మన ఏపీకి వస్తోంది. ఈ 1GW ప్రాజెక్టు విలువ 10 బిలియన్ డాలర్లు. ఇది గేమ్ ఛేంజింగ్ ఇన్వెస్ట్‌మెంట్. రాష్ట్ర డిజిటల్ భవిష్యత్తు, ఇన్నోవేషన్‌కు ముందడుగు’ అని పేర్కొన్నారు.