News October 13, 2025

TTD డైరీలు, క్యాలెండర్లను ఆన్‌లైన్‌లో ఎలా కొనుగోలు చేయాలంటే?

image

తిరుమల తిరుపతి దేవస్థానం 2026 సంవత్సరానికి సంబంధించిన డైరీలు, క్యాలెండర్లను ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌లోనూ అందుబాటులోకి తెచ్చింది. భక్తులు www.tirumala.org లేదా ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ల ద్వారా వీటిని కొనుగోలు చేయవచ్చు. ఆన్‌లైన్ బుకింగ్ చేసుకున్న భక్తులకు టీటీడీ తపాలా శాఖ ద్వారా ఇంటి వద్దకే వాటిని చేరవేసే సౌలభ్యాన్ని కల్పించింది. ఈ వెబ్‌సైట్లలోనే సప్తగిరి మ్యాగజైన్ కూడా అందుబాటులో ఉంది.

Similar News

News October 13, 2025

రేపు చరిత్ర సృష్టించబోతున్నాం: మంత్రి లోకేశ్

image

AP: రాష్ట్ర ప్రభుత్వంతో గూగుల్ సంస్థ రేపు MOU చేసుకోబోతోందని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. ‘2024 OCTలో USలోని Google ఆఫీసును సందర్శించా. ఏడాదిపాటు చర్చలు, కృషి తర్వాత రేపు చరిత్ర సృష్టించబోతున్నాం. టెక్ దిగ్గజాల్లో ఒక్కటైన గూగుల్ మన ఏపీకి వస్తోంది. ఈ 1GW ప్రాజెక్టు విలువ 10 బిలియన్ డాలర్లు. ఇది గేమ్ ఛేంజింగ్ ఇన్వెస్ట్‌మెంట్. రాష్ట్ర డిజిటల్ భవిష్యత్తు, ఇన్నోవేషన్‌కు ముందడుగు’ అని పేర్కొన్నారు.

News October 13, 2025

విష్ణువు నరసింహ అవతారం ఎందుకు ఎత్తాడు?

image

హిరణ్యకశిపుడు బ్రహ్మ దేవుడి నుంచి ‘పగలు, రాత్రి; ఇంట్లో, బయట; ఆకాశంలో, భూమిపైన; ఆయుధంతో, నిరాయుధుడిగా; మనిషి చేత, జంతువు చేత’ మరణం ఉండదని వరం పొందాడు. తన భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించడానికి, ఈ వరాలను తప్పు పట్టకుండా, విష్ణువు సంధ్యా వేళలో(పగలు-రాత్రి కాని వేళ), ఇంటి గడపపై (ఇంట్లో-బయట కాని చోట), తన ఒడిలో ఉంచుకొని (ఆకాశం-భూమి కాని ప్రదేశం), గోళ్లతో(ఆయుధం-నిరాయుధం కానిది), నరసింహ రూపంలో సంహరించాడు.

News October 13, 2025

సాయంకాలం ఇంటి తలుపులు మూసేస్తున్నారా?

image

పురాణాల ప్రకారం.. సాయంత్రం వేళ జ్యేష్ఠాదేవి వెనుక ద్వారం నుంచి, మహాలక్ష్మి సింహద్వారం నుంచి ఇంట్లోకి ప్రవేశిస్తారు. అందుకే సంధ్యా సమయానికి ముందే ఇల్లు శుభ్రం చేసి, లక్ష్మీదేవి ఆగమనాన్ని ఆహ్వానించాలి. జ్యేష్ఠాదేవి రాకుండా, వెనుక వైపు తలుపులను మూసి, ప్రధాన ద్వారాన్ని తెరిచి ఉంచాలి. ఫలితంగా అమ్మవారి కటాక్షం లభిస్తుంది.
☛ మరిన్ని ధర్మ సందేహాల నివృత్తి కోసం <<-se_10013>>భక్తి<<>> కేటగిరీకి వెళ్లండి.