News October 13, 2025

వరంగల్: అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లు సీజ్

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వేర్వేరు ఘటనల్లో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న నాలుగు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. నాలుగు కేసుల్లో ఆరుగురిని అరెస్ట్ చేసి 2 ట్రాక్టర్లు, 12 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. పాలకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు కేసులు, దామెరలో ఒక కేసు నమోదైంది.

Similar News

News October 13, 2025

మంచిర్యాల: కీటక జనిత వ్యాధులపై అవగాహన

image

జిల్లాలోని ప్రభావిత మండలాల్లో 20 బృందాల ద్వారా ఫైలేరియాని నిర్ధారణ కోసం రాపిడ్ టెస్టులను నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యారోగ్య అధికారి డా.అనిత చెప్పారు. మంచిర్యాల మండలం తాళ్లపేట పీహెచ్సీలో సర్వేలో పాల్గొంటున్న బృందాలతో సమీక్ష నిర్వహించారు. కీటక జనిత వ్యాధులైన మలేరియా, డెంగీ, చికెన్ గునియా, ఫైలేరియా వ్యాధులపై ప్రజల్లో అవగాహన కలిగించాలన్నారు. దోమలు కుట్టకుండా, వృద్ధి చెందకుండా చూడాలన్నారు.

News October 13, 2025

నిర్మల్: గుర్తుతెలియని మృతదేహం..

image

నిర్మల్ జిల్లా జనరల్ ఆసుపత్రి మార్చురీలో ఒక గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ నెల 8న ఉదయం 11 గంటలకు ఈ వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుడిచేతిపై ‘మామ్ డాడ్’ అని పచ్చబొట్టు ఉందని తెలిపారు. మృతుని వివరాలు తెలిసినవారు వెంటనే తమను సంప్రదించాలని కోరారు.

News October 13, 2025

అనకాపల్లి జిల్లాలో 1.30 లక్షల గుంబూషియా చేపలు విడుదల

image

గుంబూషియా చేపలతో దోమలను నియంత్రించవచ్చునని డీఆర్ఓ సత్యనారాయణరావు అన్నారు. సోమవారం కలెక్టరేట్ ప్రాంగణంలో గల కొలనులో గుంబూషియా చేపలను విడుదల చేశారు. జిల్లాలో ఎంపిక చేసిన 295 నీటి నిల్వ కేంద్రాలు, చెరువులు,కొలనులు బావుల్లో 1.30 లక్షల గుంబూషియా చేపలను విడుదల చేసినట్లు తెలిపారు. యాంటీ లార్వా ఆపరేషన్ లో ఈ చేపలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఇవి నీటిలో లార్వాను పూర్తిగా తినేస్తాయన్నారు.