News October 13, 2025

వెండిపై పెట్టుబడి: ట్రేడర్‌కు రూ.600 కోట్ల నష్టం!

image

కమోడిటీ ట్రేడింగులో అనుభవలేమి నిలువునా ముంచుతుందనేందుకు మరో ఉదాహరణ. కొండెక్కిన వెండిని ఒకరు భారీగా షార్ట్ చేశారని స్టాక్ మార్కెట్ కోచ్ ఏకే మాన్‌ధన్ ట్వీట్ చేశారు. అయితే రేటు ఇంకా ఎగిసి ATHకు చేరడంతో బ్రోకర్ ఆ పొజిషన్లను క్లోజ్ చేశారన్నారు. దాంతో ఆ ట్రేడర్ ఏకంగా రూ.600Cr నష్టపోయాడని తెలిపారు. అతడెవరో ఆయన వెల్లడించలేదు. మొదట ఎక్కువ ధరకు అమ్మి తర్వాత తక్కువ ధరకు కొని లాభపడటాన్ని షార్టింగ్ అంటారు.

Similar News

News October 13, 2025

అంబేడ్కర్ ఓపెన్‌ వర్సిటీలో ప్రవేశాలు.. 2 రోజులే ఛాన్స్!

image

TG: అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీలో 2025-26 విద్యా సంవత్సరానికి BA, B.Com, BSc కోర్సుల్లో అడ్మిషన్లకు దరఖాస్తు గడువు ఈనెల 15తో ముగియనుంది. ఇదే చివరి అవకాశం అని విద్యార్థి సేవా విభాగం డైరెక్టర్ డా.వై.వెంకటేశ్వర్లు తెలిపారు. ఇంటర్మీడియట్ లేదా ఓపెన్ ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ 10+2 ఉత్తీర్ణులు అర్హులని చెప్పారు. విద్యార్థులు దరఖాస్తుల కోసం <>www.braouonline.in<<>> వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.

News October 13, 2025

విద్యార్థినులకు తోడ్పాటునందించే స్కాలర్‌షిప్

image

దేశవ్యాప్తంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు చేసే విద్యార్థినులకు యూ-గో సంస్థ స్కాలర్‌షిప్ అందజేస్తోంది. 10th, Interలో 70% మార్కులు సాధించి ఉండాలి. వార్షిక ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువగా ఉండాలి. ఉపాధ్యాయ శిక్షణ, నర్సింగ్, ఫార్మసీ, మెడిసిన్, ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, లా కోర్సులు చదువుతున్న విద్యార్థినులు అర్హులు. సంవత్సరానికి 40వేలు అందిస్తారు. చివరి తేదీ అక్టోబరు 31. వెబ్‌సైట్: <>www.b4s.in/sen/RFS12<<>>

News October 13, 2025

ఏపీ లిక్కర్ స్కామ్‌ కేసులో కీలక పరిణామం

image

AP: లిక్కర్ స్కామ్ కేసు నిందితుడు వెంకటేశ్ నాయుడి(A-34) ఫోన్‌ను అన్‌లాక్ చేసేందుకు సిట్‌కు ACB కోర్టు అనుమతినిచ్చింది. వెంకటేశ్ ఫోన్‌లో మరిన్ని ఆధారాలు ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. రేపు ఎఫ్ఎస్ఎల్‌లో ఫోన్ తెరవనున్నారు. లిక్కర్ స్కామ్ డబ్బును తరలించడానికి సహకారం అందించాడని వెంకటేశ్‌పై ఆరోపణలున్నాయి. అతడు డబ్బులు లెక్కిస్తున్న వీడియో అప్పట్లో వైరలైంది.