News October 13, 2025

గ్రీన్ ఫీల్డ్ హైవేతో పల్నాడు జిల్లాకు మహర్దశ

image

హైదరాబాదు నుంచి పల్నాడు జిల్లా మీదగా అమరావతిని కలుపుతూ గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రతిపాదనలు కార్యరూపం దాల్చే అవకాశం ఉండడంతో పల్నాడు జిల్లాకు మహర్దశ పట్టనుంది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుంచి ఏపీలోని బందర్ పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవేకు కేంద్ర ప్రభుత్వం డిపిఆర్ సిద్ధం చేసింది. టీఎస్‌లోని హాలియా, అడవిదేవరపల్లి, వజీరాబాద్ నుంచి ఏపీలోని దైద, దాచేపల్లి, ముత్యాలంపాడు మీదగా హైవేను ప్రతిపాదించారు.

Similar News

News October 13, 2025

GWL: రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రాలు

image

రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు గద్వాల అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లపై కన్జ్యూమర్ అఫైర్స్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ స్టీఫెన్ రవీంద్ర కలెక్టర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ సంబంధిత అధికారులతో పాల్గొని ఏర్పాట్ల గురించి వివరించారు.

News October 13, 2025

30 లక్షల టన్నుల బియ్యం కొనుగోలు: కృష్ణదేవరాయలు

image

AP: రాష్ట్రంలో ఈ ఏడాది 30 లక్షల టన్నుల బియ్యం సేకరణకు కేంద్రం అంగీకారం తెలిపిందని FCI కన్సల్టేటివ్ కమిటీ ఛైర్మన్‌ కృష్ణదేవరాయలు తెలిపారు. గత ఏడాది 15.92 లక్షల టన్నులు సేకరించిందని చెప్పారు. 14 లక్షల టన్నుల బియ్యాన్ని 10% బ్రోకెన్‌తో కొనుగోలు చేస్తారని, పంజాబ్‌ తరువాత ఏపీకే ఈ అవకాశం దక్కిందన్నారు. SKLM, VZM, పల్నాడు జిల్లాల్లో రాష్ట్రం స్థలాన్ని చూపిస్తే కొత్తగా గోడౌన్లను నిర్మిస్తామని వివరించారు.

News October 13, 2025

జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బస్సులు

image

జిల్లాలోని బస్సు డిపోల నుంచి పంచరామాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఏలూరు రవాణా శాఖ అధికారిణి షేక్ షబ్నం సోమవారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. కార్తీక మాసం నేపథ్యంలో అక్టోబర్ 26, నవంబరు 2, 9, 16 తేదీలలో ఆయా డిపోల నుంచి ఆదివారం రాత్రి 8 గంటలకు బస్సు బయలుదేరి సోమవారం రాత్రి వస్తుందన్నారు. ఎక్స్‌ప్రెస్‌కు రూ.900, ఆల్ట్రా డీలక్స్ రూ.1100, సూపర్ లగ్జరీ రూ.1200లను టికెట్ ధరగా నిర్ణయించామన్నారు.