News October 13, 2025
వైకుంఠమే భువి చేరితే.. అదే తిరుమల కొండ

తిరుమలను కలియుగ వైకుంఠంగా పేర్కొంటారు. నిజానికి ఇది వైకుంఠంలో భాగమేనని చాలామందికి తెలియదు. ప్రళయ కాలంలో భూమిని పైకి తెచ్చిన విష్ణువు కొంతకాలం ఇక్కడే ఉండాలని సంకల్పించాడు. అప్పుడు శ్రీహరి నివాసానికై గరుత్మంతుడు వైకుంఠం నుంచి తెచ్చిన క్రీడాశైలమే ఈ వేంకటాచలం. దీన్ని సువర్ణముఖి నదికి ఉత్తరాన ఏర్పాటు చేశారు. అదే ఇప్పుడు లక్షలాది భక్తులు దర్శించుకునే తిరుమల కొండగా ప్రసిద్ధి చెందింది. <<-se>>#VINAROBHAGYAMU<<>>
Similar News
News October 13, 2025
బందీల విడుదల.. మహిళలు ఏమయ్యారు?

గాజా పీస్ ప్లాన్‌లో భాగంగా హమాస్ మిగతా 20 మంది ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసింది. రెండేళ్ల తర్వాత వారు కుటుంబాలను కలుసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. బతికున్న వారందరినీ రిలీజ్ చేసినట్లు హమాస్ ప్రకటించింది. అయితే వారిలో ఒక్క మహిళ కూడా లేదు. ఇజ్రాయెల్‌పై దాడికి దిగిన సమయంలో మహిళలను అపహరించి హమాస్ అకృత్యాలకు పాల్పడింది. వారిని చంపేసిందా? లేదా తమ అధీనంలోనే పెట్టుకుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
News October 13, 2025
8 ఏళ్ల కనిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం

భారత కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం SEPలో 1.54% తగ్గినట్లు నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ తెలిపింది. గత 8 ఏళ్లలో(2017 నుంచి) ఇదే అత్యల్పమని, ఆహార ధరలు తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమంది. కూరగాయలు, పప్పులు, పండ్లు, ఆయిల్, ఎగ్స్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గి వినియోగదారులకు ఉపశమనం కలిగినట్లు పేర్కొంది. కేరళ 9.05% తగ్గుదలతో టాప్‌లో ఉండగా AP 1.36%, TG -0.15%తో 10, 19 స్థానాల్లో నిలిచాయి.
News October 13, 2025
ట్రంప్, నెతన్యాహును ప్రశంసించిన మోదీ

హమాస్ నిర్బంధం నుంచి రెండేళ్ల తర్వాత ఇజ్రాయెల్ బందీలు విడుదల కావడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ‘బందీలకు లభించిన ఈ స్వేచ్ఛ వారి కుటుంబాల ధైర్యానికి నివాళిగా నిలుస్తోంది. ప్రెసిడెంట్ ట్రంప్ అసమాన శాంతి ప్రయత్నాలు, ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు దృఢ సంకల్పానికి ఇది నిదర్శనం. ఆ ప్రాంతంలో శాంతి నెలకొల్పడానికి ట్రంప్ చేసిన హృదయపూర్వక కృషిని స్వాగతిస్తున్నాం’ అని ట్వీట్ చేశారు.