News October 13, 2025
పీజీఆర్‌ఎస్‌కు 24 అర్జీలు: ఎస్పీ రాహుల్ మీనా

పీజీఆర్‌ఎస్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో 24 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. వాటిని చట్ట పరిధిలో విచారించి, త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి, బాధితులకు సత్వర న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
Similar News
News October 13, 2025
8 ఏళ్ల కనిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం

భారత కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం SEPలో 1.54% తగ్గినట్లు నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ తెలిపింది. గత 8 ఏళ్లలో(2017 నుంచి) ఇదే అత్యల్పమని, ఆహార ధరలు తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమంది. కూరగాయలు, పప్పులు, పండ్లు, ఆయిల్, ఎగ్స్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గి వినియోగదారులకు ఉపశమనం కలిగినట్లు పేర్కొంది. కేరళ 9.05% తగ్గుదలతో టాప్‌లో ఉండగా AP 1.36%, TG -0.15%తో 10, 19 స్థానాల్లో నిలిచాయి.
News October 13, 2025
తిరుపతి జిల్లాలో ITI చదవాలి అనుకుంటున్నారా?

తిరుపతి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కాలేజీల్లో మిగిలిన సీట్లకు 5వ విడత ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు తిరుపతి ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ గణేశ్ ఓ ప్రకటన విడుదల చేశారు. పదో తరగతి పాస్/ ఫెయిల్ అయిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 16. మరిన్ని వివరాలకు దగ్గరలోని ఐటీఐ కాలేజీని సంప్రదించాలి.
News October 13, 2025
ట్రంప్, నెతన్యాహును ప్రశంసించిన మోదీ

హమాస్ నిర్బంధం నుంచి రెండేళ్ల తర్వాత ఇజ్రాయెల్ బందీలు విడుదల కావడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ‘బందీలకు లభించిన ఈ స్వేచ్ఛ వారి కుటుంబాల ధైర్యానికి నివాళిగా నిలుస్తోంది. ప్రెసిడెంట్ ట్రంప్ అసమాన శాంతి ప్రయత్నాలు, ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు దృఢ సంకల్పానికి ఇది నిదర్శనం. ఆ ప్రాంతంలో శాంతి నెలకొల్పడానికి ట్రంప్ చేసిన హృదయపూర్వక కృషిని స్వాగతిస్తున్నాం’ అని ట్వీట్ చేశారు.