News October 13, 2025
ఏపీ అప్‌డేట్స్

☛ లిక్కర్ స్కామ్ కేసు నిందితులకు ఈ నెల 16 వరకు రిమాండ్ పొడిగింపు.. న్యూయార్క్ వెళ్లేందుకు MP మిథున్ రెడ్డి వేసిన పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా.. కౌంటర్ దాఖలు చేయాలని సిట్‌కు కోర్టు ఆదేశం
☛ రేపు, ఎల్లుండి రాజస్థాన్ ఉదయ్‌పుర్‌లో మంత్రి దుర్గేశ్ పర్యటన.. నేషనల్ టూరిజం కాన్ఫరెన్స్‌లో పాల్గొననున్న మంత్రి
☛ పశుసంవర్ధక శాఖలో 157 మంది ల్యాబ్ టెక్నీషియన్ల కాంట్రాక్టు సర్వీసులు మరో ఏడాది పాటు పొడిగింపు
Similar News
News October 13, 2025
బందీల విడుదల.. మహిళలు ఏమయ్యారు?

గాజా పీస్ ప్లాన్‌లో భాగంగా హమాస్ మిగతా 20 మంది ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసింది. రెండేళ్ల తర్వాత వారు కుటుంబాలను కలుసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. బతికున్న వారందరినీ రిలీజ్ చేసినట్లు హమాస్ ప్రకటించింది. అయితే వారిలో ఒక్క మహిళ కూడా లేదు. ఇజ్రాయెల్‌పై దాడికి దిగిన సమయంలో మహిళలను అపహరించి హమాస్ అకృత్యాలకు పాల్పడింది. వారిని చంపేసిందా? లేదా తమ అధీనంలోనే పెట్టుకుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
News October 13, 2025
8 ఏళ్ల కనిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం

భారత కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం SEPలో 1.54% తగ్గినట్లు నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ తెలిపింది. గత 8 ఏళ్లలో(2017 నుంచి) ఇదే అత్యల్పమని, ఆహార ధరలు తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమంది. కూరగాయలు, పప్పులు, పండ్లు, ఆయిల్, ఎగ్స్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గి వినియోగదారులకు ఉపశమనం కలిగినట్లు పేర్కొంది. కేరళ 9.05% తగ్గుదలతో టాప్‌లో ఉండగా AP 1.36%, TG -0.15%తో 10, 19 స్థానాల్లో నిలిచాయి.
News October 13, 2025
ట్రంప్, నెతన్యాహును ప్రశంసించిన మోదీ

హమాస్ నిర్బంధం నుంచి రెండేళ్ల తర్వాత ఇజ్రాయెల్ బందీలు విడుదల కావడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ‘బందీలకు లభించిన ఈ స్వేచ్ఛ వారి కుటుంబాల ధైర్యానికి నివాళిగా నిలుస్తోంది. ప్రెసిడెంట్ ట్రంప్ అసమాన శాంతి ప్రయత్నాలు, ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు దృఢ సంకల్పానికి ఇది నిదర్శనం. ఆ ప్రాంతంలో శాంతి నెలకొల్పడానికి ట్రంప్ చేసిన హృదయపూర్వక కృషిని స్వాగతిస్తున్నాం’ అని ట్వీట్ చేశారు.