News October 13, 2025
అనంతగిరి: కందిరీగల దాడిలో మహిళ మృతి

కందిరీగలు దాడిలో ఓ మహిళ తీవ్రంగా గాయపడి మరణించింది. కుటుంబీకుల వివరాల మేరకు..అనంతగిరి(M) కరయిగూడ గ్రామానికీ చెందిన శాంతి (20) ఆదివారం సాయంత్రం గ్రామ సమీపం కొండవద్ద పశువులను కాసేందుకు వెళ్లింది. ఒక్కసారిగా గుంపులగా కందిరీగలు ఆమె దాడి చేశాయి. స్థానికులు హుటాహుటిన కుటుంబ సభ్యులు అరకు ఏరియా ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాధితురాలు నేడు మృతి చెందింది.
Similar News
News October 13, 2025
విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయానికి 40 ఫిర్యాదులు

జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను సోమవారం నిర్వహించారు. మొత్తం 40 ఫిర్యాదులు స్వీకరించగా, అందులో భూ తగాదాలు 8, కుటుంబ కలహాలు 5, మోసాలు 4, నగదు వ్యవహారం 1, ఇతర అంశాలు 22 ఉన్నాయని ఎస్పీ దామోదర్ తెలిపారు. ఫిర్యాదులపై 7 రోజుల్లో చర్యలు తీసుకుని నివేదికను జిల్లా పోలీసు కార్యాలయానికి పంపాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.
News October 13, 2025
MHBD: వసతి గృహాలను తనిఖీ చేయాలి: కలెక్టర్

ప్రత్యేక అధికారులు అన్ని వసతి గృహాలను తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని సంక్షేమ వసతి గృహాలలో ఈరోజు, రేపు, ఎల్లుండి, మూడు రోజులు ప్రత్యేక అధికారులు తనిఖీ నిర్వహించి, పరిసరాలను పరిశీలించి, పిల్లలతో కలిసి భోజనం, వసతి గృహాలలో పరిస్థితులను గమనించాలన్నారు.
News October 13, 2025
సూర్యాపేట: బాలికపై అత్యాచారం.. పోక్సో కేసు నమోదు

MBNR (D) సీసీ కుంటలోని ఓ గ్రామానికి చెందిన బాలికను మఠంపల్లి మండలం బోజ తండాకు చెందిన చందర్ నాయక్ ప్రేమ పేరుతో అత్యాచారం చేశాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, బాలికను సఖి కేంద్రానికి తరలించినట్లు సీసీ కుంట సీఐ రామకృష్ణ తెలిపారు.