News October 13, 2025
జగిత్యాల: ప్రజావాణిలో 55 ఫిర్యాదుల స్వీకరణ

జగిత్యాల జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల అర్జీలు స్వీకరించారు. మొత్తం 55 ఫిర్యాదులు వచ్చాయని ఆయన తెలిపారు. ప్రతి ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపి త్వరితగతిన పరిష్కారం చూపాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో అ.కలెక్టర్లు BS లత, రాజగౌడ్, RDOలు మధుసూదన్, శ్రీనివాస్, జీవాకర్ రెడ్డి, జిల్లాధికారులు, తహశీల్దార్లు పాల్గొన్నారు.
Similar News
News October 13, 2025
జిల్లా వ్యాప్తంగా 2 రోజులు భారీ వర్షాలు: కలెక్టర్

జిల్లాలో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కలెక్టర్ వెట్రి సెల్వి ప్రజలకు పలు సూచనలు చేశారు. వర్షాల సమయంలో బహిరంగ ప్రదేశాలలో ఉండవద్దన్నారు. చెట్ల కింద, శిథిల భవనాల వద్ద ఉండవద్దని సూచించారు. ఉరుములు, మెరుపుల సమయంలో రైతులు పొలాలకు దూరంగా ఉండాలని కోరారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు.
News October 13, 2025
వైస్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ

14 ఏళ్ల వయసులోనే తన విధ్వంసకర బ్యాటింగ్‌తో క్రీడా ప్రపంచాన్ని మెప్పించిన వైభవ్ సూర్యవంశీకి బిహార్ క్రికెట్ అసోసియేషన్ ప్రమోషన్ ఇచ్చింది. రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ తొలి 2 రౌండ్లకు వైస్ కెప్టెన్‌గా నియమించింది. ఆ జట్టు కెప్టెన్‌గా సకీబుల్ గని వ్యవహరించనున్నారు. ఎల్లుండి నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది. కాగా IPLలో RR తరఫున అదరగొట్టిన వైభవ్.. ఇటీవల IND-U19 జట్టు తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ సాధించారు.
News October 13, 2025
బాపట్ల పోలీస్ కార్యాలయానికి 66 అర్జీలు

బాపట్ల పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఎస్పీ ఉమామహేశ్వర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 66 అర్జీలు అందినట్లు తెలిపారు. ఫిర్యాదులను చట్టపరిధిలో వేగంగా పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రజలు స్వయంగా వచ్చి తమ సమస్యలను అర్జీల రూపంలో అందించవచ్చని పేర్కొన్నారు.