News October 13, 2025

జగిత్యాల: విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

image

OCT 21న పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఆన్‌లైన్ వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ పోటీలు తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ఉంటాయని, 6వ తరగతి నుంచి PG విద్యార్థులు ఇందులో పాల్గొనవచ్చన్నారు. “Drugs Menace: Role Of Police In Prevention And How Students Can Stay Away From Drugs” అంశంపై ఈనెల 28లోగా వ్యాసాలు సమర్పించాలన్నారు. SHARE IT.

Similar News

News October 13, 2025

జిల్లా వ్యాప్తంగా 2 రోజులు భారీ వర్షాలు: కలెక్టర్

image

జిల్లాలో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కలెక్టర్ వెట్రి సెల్వి ప్రజలకు పలు సూచనలు చేశారు. వర్షాల సమయంలో బహిరంగ ప్రదేశాలలో ఉండవద్దన్నారు. చెట్ల కింద, శిథిల భవనాల వద్ద ఉండవద్దని సూచించారు. ఉరుములు, మెరుపుల సమయంలో రైతులు పొలాలకు దూరంగా ఉండాలని కోరారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు.

News October 13, 2025

వైస్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ

image

14 ఏళ్ల వయసులోనే తన విధ్వంసకర బ్యాటింగ్‌తో క్రీడా ప్రపంచాన్ని మెప్పించిన వైభవ్ సూర్యవంశీకి బిహార్ క్రికెట్ అసోసియేషన్ ప్రమోషన్ ఇచ్చింది. రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ తొలి 2 రౌండ్లకు వైస్ కెప్టెన్‌గా నియమించింది. ఆ జట్టు కెప్టెన్‌గా సకీబుల్ గని వ్యవహరించనున్నారు. ఎల్లుండి నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది. కాగా IPLలో RR తరఫున అదరగొట్టిన వైభవ్.. ఇటీవల IND-U19 జట్టు తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ సాధించారు.

News October 13, 2025

బాపట్ల పోలీస్ కార్యాలయానికి 66 అర్జీలు

image

బాపట్ల పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఎస్పీ ఉమామహేశ్వర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 66 అర్జీలు అందినట్లు తెలిపారు. ఫిర్యాదులను చట్టపరిధిలో వేగంగా పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రజలు స్వయంగా వచ్చి తమ సమస్యలను అర్జీల రూపంలో అందించవచ్చని పేర్కొన్నారు.