News October 13, 2025

JGTL: మిషన్ భగీరథ నూతన EEగా జానకి బాధ్యతలు

image

జగిత్యాల జిల్లా మిషన్ భగీరథ నూతన ఈఈగా జానకి నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం మిషన్ భగీరథ కార్యాలయంలో ఈఈగా ఆమె బాధ్యతలు చేపట్టారు. అనంతరం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమా‌ను ఆయన క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ DE జలంధర రెడ్డి, AEలు రాజశేఖర్, దీపక్ పాల్గొన్నారు.

Similar News

News October 13, 2025

మేడ్చల్: డీసీసీ అధ్యక్ష పదవికి నక్క ప్రభాకర్ గౌడ్ నామినేషన్

image

కాంగ్రెస్ పార్టీ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అధ్యక్ష పదవికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నక్క ప్రభాకర్ గౌడ్ ఈరోజు నామినేషన్ వేశారు. ఏఐసీసీ పరిశీలకురాలు అంజలి నింబాల్కర్‌కు నక్క ప్రభాకర్ గౌడ్ తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. పార్టీ అభివృద్ధి కోసమే కాకుండా మేడ్చల్ జిల్లా ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ సమాజ సేవ చేస్తున్న తనకు డీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చేలా చూడాలని నక్క ప్రభాకర్ గౌడ్ కోరారు.

News October 13, 2025

చిత్తూరు పోలీసులకు 34 ఫిర్యాదులు

image

చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడీ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. వివిధ సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు. బాధితుల నుంచి 34 అర్జీలు అందినట్లు అధికారులు తెలిపారు. చట్ట ప్రకారం వీటిని పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ ఆదేశించారు. ఇందులో అత్యధికంగా భూతగాదాలపై 13 ఫిర్యాదులు అందాయి.

News October 13, 2025

వనపర్తి: బాల్యవివాహాలు నిర్వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

image

జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో బాల్యవివాహాలు నిర్వహించడానికి వీలు లేదని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే అమ్మాయి, అబ్బాయి, తల్లిదండ్రులతోపాటు వివాహంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిపై చట్టరీత్యా కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఈనెల 15న అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామస్థాయి కమిటీలు, సమావేశాలు నిర్వహించి అదే రోజున మండల కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.