News October 13, 2025

జగిత్యాల: గ్రీవెన్స్ డే.. స్వయంగా సమస్యలు విన్న SP

image

జగిత్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డేలో 10 మంది అర్జీదారుల సమస్యలను ఎస్పీ అశోక్ కుమార్ స్వయంగా తెలుసుకున్నారు. సంబంధిత అధికారులను ఫిర్యాదుల పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించారు. సమస్యలను త్వరగా, పెండింగ్ లేకుండా పరిష్కరించడం, ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్‌లో నమోదు చేసి పర్యవేక్షించడం చేయాలని సూచించారు.

Similar News

News October 13, 2025

NGKL: పోలీస్ ప్రజావాణిలో 15 దరఖాస్తులు

image

జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 15 ఫిర్యాదులు స్వీకరించినట్లు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. స్వయంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. వివిధ గ్రామాలు, మండలాల నుంచి వచ్చిన ఈ ఫిర్యాదులను తక్షణమే పరిశీలించి, పరిష్కారం చూపాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు.

News October 13, 2025

రేపు ప్రకాశం జిల్లాకు భారీ వర్ష సూచన

image

కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి సగటున 0.9 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించిన నేపథ్యంలో ప్రకాశంకు రేపు వర్ష సూచన ఉన్నట్లు ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ప్రకాశం జిల్లాలో మంగళవారం పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, చెట్ల కింద ఉండరాదని సూచించారు.

News October 13, 2025

మేడ్చల్: డీసీసీ అధ్యక్ష పదవికి నక్క ప్రభాకర్ గౌడ్ నామినేషన్

image

కాంగ్రెస్ పార్టీ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అధ్యక్ష పదవికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నక్క ప్రభాకర్ గౌడ్ ఈరోజు నామినేషన్ వేశారు. ఏఐసీసీ పరిశీలకురాలు అంజలి నింబాల్కర్‌కు నక్క ప్రభాకర్ గౌడ్ తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. పార్టీ అభివృద్ధి కోసమే కాకుండా మేడ్చల్ జిల్లా ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ సమాజ సేవ చేస్తున్న తనకు డీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చేలా చూడాలని నక్క ప్రభాకర్ గౌడ్ కోరారు.