News October 13, 2025
నూతన సంస్కరణలతో నాణ్యమైన విద్యుత్: CMD

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యాలను నెరవేరుస్తూ నూతన సంస్కరణలతో నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యమని APSPDCL నూతన CMD శివశంకర్ అన్నారు. తిరుపతిలోని కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడారు. భవిష్యత్తులో సోలార్ విద్యుత్‌ను అభివృద్ధి చేసి రివర్స్ పవర్ సాధిస్తామన్నారు. విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.
Similar News
News October 13, 2025
తిరుపతి: నాన్నతో కలిసి పాఠాలు..❤

కొత్త టీచర్లు విధుల్లో చేరే వేళ తిరుపతి జిల్లాలో సోమవారం ఆసక్తికర ఘటన వెలుగు చూసింది. చంద్రగిరి జడ్పీ స్కూల్లో రవీంద్రుడు తెలుగు టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆయన కుమారుడు హరిప్రసాద్ DSC రాసి ఫిజిక్స్ టీచర్‌గా సెలెక్ట్ అయ్యారు. తండ్రి పనిచేస్తున్న ఆ స్కూల్లోనే జాబ్ వచ్చింది. ఈక్రమంలో వారిద్దరూ తీసుకున్న ఫొటో వైరలవుతోంది. తండ్రితో కలిసే అతను పాఠాలు చెప్పనున్నారు.
News October 13, 2025
మేడ్చల్: ధాన్యం కొనుగోలు కేంద్రాలపై పౌరసరఫరాల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్

ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులతో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతులకు సౌకర్యవంతమైన విధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణం పరిశీలించాలని కమిషనర్ సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ సుగుణ భాయ్ పాల్గొన్నారు.
News October 13, 2025
రామవరప్పాడులో వ్యక్తి మృతి

విజయవాడ రామవరప్పాడులో సోమవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. ఆర్టీసీ కాలనీ నుంచి రామవరప్పాడు పీఎస్ఆర్ కాలనీ వైపు ఓ వృద్ధుడు బైక్‌పై వస్తున్నాడు. ఈ క్రమంలో ఏలూరు వైపు వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ అతన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉందని మాచవరం సీఐ ప్రకాష్ తెలిపారు.