News October 13, 2025
PDPL: పోలీస్ సిబ్బందికి కిట్ల పంపిణీ

రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా పోలీస్ సిబ్బందికి ఉన్ని దుప్పటి, వులెన్ జాకెట్, టీ- షర్ట్, రెయిన్‌కోట్, హవర్ సాక్స్ పంపిణీ చేశారు. వాతావరణ మార్పులు, క్షేత్రస్థాయి కష్టాలను దృష్టిలో ఉంచుకొని సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు CUP తెలిపారు. వ్యక్తిగత, కుటుంబ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఆయన సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు DCP శ్రీనివాస్, RIలతో పాటు పలువురు పాల్గొన్నారు.
Similar News
News October 13, 2025
తిరుపతి: నాన్నతో కలిసి పాఠాలు..❤

కొత్త టీచర్లు విధుల్లో చేరే వేళ తిరుపతి జిల్లాలో సోమవారం ఆసక్తికర ఘటన వెలుగు చూసింది. చంద్రగిరి జడ్పీ స్కూల్లో రవీంద్రుడు తెలుగు టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆయన కుమారుడు హరిప్రసాద్ DSC రాసి ఫిజిక్స్ టీచర్‌గా సెలెక్ట్ అయ్యారు. తండ్రి పనిచేస్తున్న ఆ స్కూల్లోనే జాబ్ వచ్చింది. ఈక్రమంలో వారిద్దరూ తీసుకున్న ఫొటో వైరలవుతోంది. తండ్రితో కలిసే అతను పాఠాలు చెప్పనున్నారు.
News October 13, 2025
మేడ్చల్: ధాన్యం కొనుగోలు కేంద్రాలపై పౌరసరఫరాల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్

ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులతో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతులకు సౌకర్యవంతమైన విధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణం పరిశీలించాలని కమిషనర్ సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ సుగుణ భాయ్ పాల్గొన్నారు.
News October 13, 2025
రామవరప్పాడులో వ్యక్తి మృతి

విజయవాడ రామవరప్పాడులో సోమవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. ఆర్టీసీ కాలనీ నుంచి రామవరప్పాడు పీఎస్ఆర్ కాలనీ వైపు ఓ వృద్ధుడు బైక్‌పై వస్తున్నాడు. ఈ క్రమంలో ఏలూరు వైపు వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ అతన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉందని మాచవరం సీఐ ప్రకాష్ తెలిపారు.