News October 13, 2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 300 నామినేషన్లు వేస్తాం: మందాల భాస్కర్

image

తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ నాయకులు ఈరోజు HYD సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించి మాట్లాడారు. మాలలకు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణలో అన్యాయం జరిగిందని, దానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమేనని మండిపడ్డారు. మాలలకు జరిగిన అన్యాయానికి నిరసనగా రానున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో 300 మంది మాలలు నామినేషన్లు వేస్తామని జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మాదాల భాస్కర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Similar News

News October 13, 2025

HYD: ఖైదీల సంక్షేమంలో చర్లపల్లి జైలు నంబర్ వన్!

image

చర్లపల్లి జైలును ఈరోజు సందర్శించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడారు. ఖైదీల సంక్షేమంలో చర్లపల్లి జైలు దేశానికి ఆదర్శమన్నారు. ఖైదీలకు బీమా, కుటుంబ సభ్యులకు వడ్డీలేని రుణ సదుపాయం కల్పించడం అభినందనీయమని ప్రశంసించారు. జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా విజన్ అద్భుతమని, ఖైదీల ఉత్పత్తులతో ప్రత్యేక మేళా నిర్వహించాలని సూచించారు.

News October 13, 2025

HYD: మీర్‌పేట్‌ మాధవి హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు

image

HYD బాలాపూర్ పరిధి మీర్‌పేట్‌ మాధవి హత్య కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటైంది. ఈనెల 17 నుంచి రోజువారీ జిల్లా ట్రయల్‌ కోర్టు విచారణ జరపనుంది. మాధవిని ఆమె భర్త గురుమూర్తి హత్య చేసి, ముక్కలు చేసి, కుక్కర్‌లో ఉడుకబెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో సైంటిఫిక్‌ ఆధారాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. 2 నెలల్లో తీర్పు వస్తుందని సీపీ సుధీర్‌బాబు వెల్లడించారు.

News October 13, 2025

HYD: మహిళలపై అత్యాచారం, కిడ్నాప్.. NCRB REPORT ఇదే..!

image

మహిళల కిడ్నాప్ ఘటనలకు సంబంధించి రాష్ట్రంలో 2,152 కేసులు నమోదు కాగా అందులో సైబరాబాద్ పరిధిలో ఏకంగా 500 నమోదయ్యాయి. ఇక అత్యాచారం కేసులు అత్యధికంగా HYD కమిషనరేట్ పరిధిలో 173, రాచకొండ పరిధిలో 143, సైబరాబాద్‌లో 101 ఉన్నాయి. NCRB-2023 తాజాగా విడుదల చేసిన రిపోర్ట్‌లో ఈ వివరాలను పొందుపరిచారు. మహిళలపై నేరాలకు సంబంధించి రాష్ట్రంలో అత్యధికంగా HYD కమిషనరేట్ పరిధిలో 3,822 కేసులు నమోదైనట్లు NCRB తెలిపింది.