News October 13, 2025

సత్యసాయి జిల్లా పోలీసు కార్యాలయానికి 75 పిటిషన్లు: ఎస్పీ

image

సత్యసాయి జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్‌లో 75 పిటిషన్లు స్వీకరించినట్లు జిల్లా ఎస్పీ సతీశ్ బాబు తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో ఎస్పీ నేరుగా మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సంబంధిత పోలీసు అధికారులు బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. అర్జీల పట్ల అలసత్వం ప్రదర్శించకుండా వెంటనే పరిష్కరించాలని పేర్కొన్నారు.

Similar News

News October 13, 2025

కేజీహెచ్‌లో ఫుట్ స్కానింగ్ పరీక్షలు

image

కేజీహెచ్‌లోని ఫుట్ స్కానింగ్ పరీక్షలు నిర్వహించేందుకు పరికరాన్ని సిద్ధం చేశారు. ఇప్పటివరకు హైదరాబాదులో మాత్రమే అందుబాటులో ఉండే ఈ పరికరం కేజీహెచ్‌లోని మెడిటెక్ జోన్ సహకారంతో అందుబాటులోకి తెచ్చారు. ఈ పరికరాన్ని కేజీహెచ్ సూపరింటెండెంట్ ఐ.వాణి ప్రారంభించగా.. పీజీ విద్యార్థులకు, వైద్యులకు మొదటగా పరీక్షలు చేశారు. పాదాల్లో దీర్ఘకాలిక సమస్యలు, మార్పులు గమనించి చికిత్స అందించవచ్చని వైద్యులు తెలిపారు.

News October 13, 2025

HYD: ఖైదీల సంక్షేమంలో చర్లపల్లి జైలు నంబర్ వన్!

image

చర్లపల్లి జైలును ఈరోజు సందర్శించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడారు. ఖైదీల సంక్షేమంలో చర్లపల్లి జైలు దేశానికి ఆదర్శమన్నారు. ఖైదీలకు బీమా, కుటుంబ సభ్యులకు వడ్డీలేని రుణ సదుపాయం కల్పించడం అభినందనీయమని ప్రశంసించారు. జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా విజన్ అద్భుతమని, ఖైదీల ఉత్పత్తులతో ప్రత్యేక మేళా నిర్వహించాలని సూచించారు.