News October 13, 2025

బెల్లంపల్లి: కబ్జాల నుంచి ప్రభుత్వ భూములను కాపాడండి

image

బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూములను కబ్జాల నుంచి కాపాడాలని మాజీ సర్పంచి అనిత కోరారు. ప్రజావాణిలో కలెక్టర్ దీపక్‌ కుమార్ వినతిపత్రం అందజేశారు. రాత్రికి రాత్రి చదును చేయించి ప్లాట్లుగా విభజించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని వాపోయారు. అక్రమ నిర్మాణాలకు ఇంటి నంబర్లు, కరెంటు మీటర్లు ఇచ్చి రూ.కోట్లకు అమ్ముకుంటున్నారని కలెక్టర్‌కు వివరించారు.

Similar News

News October 13, 2025

మొదటి 5 స్థానాల్లో జిల్లా ఉండేలా పనిచేయాలి: కలెక్టర్

image

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో జగిత్యాల జిల్లా రాష్ట్రంలో 22వ స్థానంలో ఉందని, మొదటి 5 స్థానాల్లో ఉండే విధంగా అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. 10,982 ఇళ్లు మంజూరు కాగా 7343 మార్కౌట్ చేయగా.. 2984 బేస్మెంట్ స్థాయిలో, 721 గోడల నిర్మాణం వరకు, 369 స్లాబ్ దశలో ఉండగా 3 ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకున్నాయన్నారు. ఇందిరమ్మ కమిటీలను సమన్వయం చేసుకుంటూ పనులు పూర్తి చేయాలన్నారు.

News October 13, 2025

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో తొలిరోజు 11 నామినేషన్లు

image

HYD జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో తొలి రోజు నామినేషన్లు ముగిశాయి. మొత్తం పది మంది 11 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. స్వతంత్రులు సిలివేరు శ్రీకాంత్‌, పెసరికాయల పరీక్షిత్ రెడ్డి, చంద్రశేఖర్, పూసా శ్రీనివాస్, వేముల విక్రమ్ రెడ్డి, ఇబ్రహీంఖాన్, ఆరావల్లి శ్రీనివాసరావు, సయ్యద్ ముస్తఫా హుస్సేన్, సల్మాన్ ఖాన్, సపావత్ సుమన్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. కాగా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నవంబర్ 11న జరగనుంది.

News October 13, 2025

MBNR: నీటి సమస్యనా.. ఫోన్ చేయండి

image

మహబూబ్ నగర్ నగర పాలక సంస్థ పరిధిలోని నీటి సమస్యలు ఉంటే ఫోన్ చేయాలని నగర పాలక సంస్థ ఓ సర్క్యులర్ విడుదల చేసింది. నగర పాలక సంస్థ పరిధిలోని పైప్ లైన్ లీకేజిలు, తాగునీటి సరఫరా, పబ్లిక్ బోర్ రిపేర్, వీధి దీపాలు వంటి సమస్యలకు Toll free నంబర్ 7093911352 కాల్ చేయాలన్నారు. ఉదయం 09:00 నుంచి సాయంత్రం 06:00 వరకు అందుబాటులో ఉంటారన్నారు.