News October 13, 2025
‘ఉల్లి’తో రైతుకు మేలు జరగాలంటే?

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని అంటారు. కానీ ఆ ఉల్లిని పండించే రైతుకు కన్నీళ్లు తప్పట్లేదు. కిలో ₹5-10 మాత్రమే పలుకుతుండటంతో అన్నదాతలు వాపోతున్నారు. రేటు పడిపోయినా ఇబ్బంది లేకుండా ఉల్లి ఆధారిత పరిశ్రమల ఏర్పాటుతో రైతులకు ప్రయోజనం ఉంటుంది. ఆనియన్ ఫ్లేక్స్, పొడి, పేస్ట్, నూనె, ఊరగాయలు, చట్నీలు తయారుచేసేలా ప్రభుత్వాలు ఆలోచన చేయాలి.
* ప్రతిరోజూ అగ్రికల్చర్ కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
Similar News
News October 13, 2025
గుండెపోటుతో కమెడియన్ మృతి

కన్నడ కమెడియన్, బిగ్‌బాస్-7 కంటెస్టెంట్ రాజు తాలికొటే మరణించారు. నిన్న అర్ధరాత్రి గుండెపోటుకు గురైన ఆయనను కర్ణాటకలోని ఉడుపి మణిపాల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మనసారె, పంచరంగి, లైఫ్ ఈజ్ దట్, రాజ్‌ధాని, మైనా, టోపీవాలా వంటి చిత్రాల్లో ఆయన నటించారు. BB-7లో పాల్గొనడంతో పాటు పలు టీవీ సీరియళ్లలోనూ సందడి చేశారు. రాజు మృతి పట్ల కర్ణాటక Dy.CM డీకే శివకుమార్ సంతాపం తెలిపారు.
News October 13, 2025
నకిలీ మద్యం కేసు.. జోగి రమేశ్ సవాల్

AP: నకిలీ మద్యం కేసులో తనపై వస్తున్న ఆరోపణలపై మాజీ మంత్రి <<17996336>>జోగి రమేశ్<<>> మరోసారి స్పందించారు. ఇదంతా చంద్రబాబు అల్లిన కట్టు కథ అని ఆరోపించారు. తిరుమల సన్నిధిలో ప్రమాణం చేసేందుకు, లై డిటెక్టర్ టెస్టుకు తాను సిద్ధమని స్పష్టం చేశారు. ప్రమాణానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సిద్ధమా అని సవాల్ విసిరారు. జనార్ధన్‌తో తనకు ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవని, బలవంతంగా అతనితో తన పేరు చెప్పించారని మండిపడ్డారు.
News October 13, 2025
వైసీపీ నేరాలను టీడీపీపైకి నెట్టే కుట్ర: చంద్రబాబు

AP: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు టీడీపీ ఎంపీలతో జరిగిన భేటీలో కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకా హత్య కేసు తరహాలోనే నకిలీ మద్యం కేసూ ఉందన్నారు. అంతా వాళ్లే చేసి తమపై నింద మోపుతున్నారని చెప్పారు. క్రిమినల్ మాస్టర్ మైండ్‌కు జగన్ ఉదాహరణ అని, వైసీపీ క్రిమినల్ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. వాళ్ల నేరాలను టీడీపీపై నెట్టేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.