News October 13, 2025
HYD: ఒకే ఇంట్లో 43 ఓట్లు.. విచారణకు ఆదేశం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటర్ జాబితాపై అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓట్ చోరీ అంటూ వచ్చిన ఆరోపణలపై ఎన్నికల అధికారి విచారణకు ఆదేశించారు. యూసుఫ్‌గూడ డివిజన్ కృష్ణానగర్‌లోని 8-3-231/బీ/160 ఇంట్లో ఇటీవల 43 ఓట్లు నమోదయ్యాయి. దీనిని సుమోటోగా స్వీకరించిన జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ విచారణకు ఆదేశించారు.
Similar News
News October 13, 2025
ASF: అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్

జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే సూచించారు. సోమవారం ASF కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇంజినీరింగ్, రోడ్లు భవనాలు, గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ అధికారులతో అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
News October 13, 2025
కోరుట్ల: వాహనం ఢీ కొని వ్యక్తి దుర్మరణం

కోరుట్ల మండలం వెంకటాపూర్ శివారులో సోమవారం గుర్తు తెలియని వాహనం ఢీ కొని కోరుట్లకి చెందిన మారుపాక వినోద్ (28) అక్కడిక్కడే మృతిచెందాడు. వినోద్ పై నుంచి వాహనం వెళ్లడంతో శరీరం నుజ్జునుజ్జైంది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు. ఆదివారం సాయంత్రం ఆ ప్రాంతంలోనే కారు, బైక్ ఢీకొని ఒకరు చనిపోగా 24 గంటలు గడవక ముందే మరో ప్రమాదం జరిగింది.
News October 13, 2025
అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలి: కలెక్టర్

పెద్దపల్లి జిల్లాలోని అన్ని అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సోమవారం అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా ఇంజినీరింగ్ విభాగాల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, రోడ్లు, ఆరోగ్య కేంద్రాల పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఉపాధి హామీ పనులు పూర్తి కావాలని, ఆలస్యం సహించబోమని హెచ్చరించారు.