News April 8, 2024
ఇందుకూరుపేట: మహిళ దారుణ హత్య

ఓ మహిళను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఇందుకూరుపేటకు చెందిన సుబ్బరత్నమ్మ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆమె భర్త మాట వినకుండా నిత్యం ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తుండేది. ఈక్రమంలో శనివారం కూలి పనికి వెళ్తున్నట్లు భర్తకు చెప్పి తిరిగి రాలేదు. ఆదివారం కోడూరుపాడులోని టెంకాయతోటలో సుబ్బరత్నమ్మ మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Similar News
News October 4, 2025
నెల్లూరు: అంగన్వాడీల్లో ఆటపాటల్లేవ్..!

చిన్నారులకు ఆట, పాటలతో సాగాల్సిన విద్యాబోధన నీరుగారుతుందనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 2934 అంగన్వాడీ కేంద్రాల్లో 45,999 మంది పిల్లలు ఉన్నారు. చాలా కేంద్రాల్లో ఆట వస్తువులు ఉండకపోగా, ఉన్నవి కాస్త విరిగిపోయి ఉన్నాయి. దీంతో ఆట వస్తువులు లేక నోటి మాటలతోనే బోధన సాగిస్తున్నారు. గతంలో ఇచ్చినవే అరకొరగా ఉన్నాయి తప్పితే.. కొత్తగా మంజూరు చేయలేదు. ఇకనైనా అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకుంటారేమో చూడాలి.
News October 4, 2025
నెల్లూరు జిల్లాకు 50 అవార్డులు

స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కింద నెల్లూరు జిల్లాకు రెండు రాష్ట్ర స్థాయి, 48 జిల్లా స్థాయి అవార్డులు వచ్చాయని కలెక్టర్ హిమాన్షు శుక్ల వెల్లడించారు. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, ప్రజా ప్రదేశాల్లో శుభ్రత, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, RRR (Reduce–Reuse–Recycle)లో అవార్డులు వచ్చాయన్నారు. sasa.ap.gov.in ద్వారా అవార్డు గ్రహీతల వివరాలు తెలుసుకోవచ్చు. ఈనెల 6న జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి వీరిని సన్మానిస్తారు.
News October 4, 2025
సత్తా చాటిన ముత్తుకూరు యువకులు

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలానికి చెందిన క్రీడాకారులు టెన్నిస్ బాల్ T10 అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్‌కు భారత్ తరఫున ప్రకాశ్, నాగేంద్ర ఎంపికయ్యారు. డిసెంబర్ 25 నుంచి 31 వరకు థాయిలాండ్ జరగబోయే సెకండ్ ఏసియన్ టెన్నిస్ బాల్ T10 క్రికెట్ ఛాంపియన్షిప్‌లో పాల్గొంటారు. వీరు ఇంతకుముందు ఒరిస్సాలో సెప్టెంబర్ 9న జరిగిన జాతీయస్థాయి పోటీల్లో కూడా ప్రతిభ కనపరిచారు.