News October 13, 2025

విష్ణువు నరసింహ అవతారం ఎందుకు ఎత్తాడు?

image

హిరణ్యకశిపుడు బ్రహ్మ దేవుడి నుంచి ‘పగలు, రాత్రి; ఇంట్లో, బయట; ఆకాశంలో, భూమిపైన; ఆయుధంతో, నిరాయుధుడిగా; మనిషి చేత, జంతువు చేత’ మరణం ఉండదని వరం పొందాడు. తన భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించడానికి, ఈ వరాలను తప్పు పట్టకుండా, విష్ణువు సంధ్యా వేళలో(పగలు-రాత్రి కాని వేళ), ఇంటి గడపపై (ఇంట్లో-బయట కాని చోట), తన ఒడిలో ఉంచుకొని (ఆకాశం-భూమి కాని ప్రదేశం), గోళ్లతో(ఆయుధం-నిరాయుధం కానిది), నరసింహ రూపంలో సంహరించాడు.

Similar News

News October 13, 2025

‘భారత కెప్టెన్‌ను మార్చాలి’.. ఫ్యాన్స్ డిమాండ్

image

స్వదేశంలో జరుగుతున్న ఉమెన్స్ వరల్డ్ కప్‌పై భారత జట్టుతో పాటు ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ SA, AUSపై వరుస ఓటములను జీర్ణించుకోలేకపోతున్నారు. గెలవాల్సిన మ్యాచ్‌ల్లో హర్మన్ కెప్టెన్సీ వల్లే ఓడిపోయామని ఫైరవుతున్నారు. బ్యాటింగ్‌లోనూ విఫలమవుతున్న తనను(21, 19, 9, 22) కెప్టెన్సీ నుంచి తొలగించాలని BCCIని డిమాండ్ చేస్తున్నారు. అటు IND సెమీస్‌కు వెళ్లాలంటే మిగతా 3 మ్యాచ్‌లూ కీలకం కానున్నాయి.

News October 13, 2025

యథాతథంగా విద్యుత్ ఉద్యోగుల సమ్మె

image

AP: ఈనెల 15 అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె యథాతథంగా జరగనున్నట్లు విద్యుత్ ఉద్యోగులు తెలిపారు. ఉద్యోగుల జేఏసీతో యాజమాన్యాల చర్చలు విఫలం కావడంతో ఈ నిర్ణయానికి వచ్చారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేవరకు పోరాటం ఆపేదే లేదని జేఏసీ స్పష్టం చేసింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు ర్యాలీలు, ధర్నాలతో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.

News October 13, 2025

గుండెపోటుతో కమెడియన్ మృతి

image

కన్నడ కమెడియన్, బిగ్‌బాస్-7 కంటెస్టెంట్ రాజు తాలికొటే మరణించారు. నిన్న అర్ధరాత్రి గుండెపోటుకు గురైన ఆయనను కర్ణాటకలోని ఉడుపి మణిపాల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మనసారె, పంచరంగి, లైఫ్ ఈజ్ దట్, రాజ్‌ధాని, మైనా, టోపీవాలా వంటి చిత్రాల్లో ఆయన నటించారు. BB-7లో పాల్గొనడంతో పాటు పలు టీవీ సీరియళ్లలోనూ సందడి చేశారు. రాజు మృతి పట్ల కర్ణాటక Dy.CM డీకే శివకుమార్ సంతాపం తెలిపారు.