News October 13, 2025

పార్వతీపురం పీజీఆర్ఎస్‌కు 112 వినతులు

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన సమస్యలను సత్వరమే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ ఆధ్వర్యంలో సోమవారం పిజిఆర్ఎస్ నిర్వహించారు. 112 మంది అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు. సమస్యలు సత్వరమే పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు

Similar News

News October 13, 2025

పిల్లలకు వాడకూడని 3 వస్తువులు

image

మూడేళ్లలోపు పిల్లల శరీరం అతి సున్నితమైంది. కొందరు పేరెంట్స్ వారికి హార్డ్ బ్రష్‌తో పళ్లు తోముతుంటారు. ఇది వారి మృదువైన చిగుళ్లకు హాని కలిగిస్తుంది. ఇక స్నానం చేయించేటప్పుడు స్క్రబ్బర్‌తో రుద్దడాన్ని చిన్నారుల సున్నితమైన చర్మం తట్టుకోలేదు. తలస్నానం చేయించాక హెయిర్ డ్రయ్యర్ వినియోగం వల్ల వారి కుదుళ్లు దెబ్బతిని త్వరగా హెయిర్ ఫాల్ అవుతుంది. ఇలా మీరు చేయిస్తున్నట్లయితే వెంటనే ఆపేయండి. SHARE IT

News October 13, 2025

NZB: బీజేపీ పోరాట ఫలితంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు: దినేష్ కులాచారి

image

బీజేపీ పోరాట ఫలితంగానే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అన్నారు. ఇటీవల జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, రైతులు ఇబ్బందులు పడుతున్నారని వినతిపత్రం ఇచ్చామని గుర్తు చేశారు. స్పందించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

News October 13, 2025

సకాలంలో స్పందించిన విశాఖ పోలీసులు

image

కంచరపాలెంకు చెందిన యువతి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా మహారాణిపేట పోలీసులు కాపాడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కంచరపాలెంలో నివాసం ఉంటున్న యువతి ఇంట్లో కలహారం కారణంగా ఎవరికి చెప్పకుండా ఆర్కే బీచ్‌కి వచ్చి చనిపోవడానికి ప్రయత్నించింది. ఇదే సమయంలో కుటుంబ సభ్యులు112కు ఫిర్యాదు చేయడంతో వెంటనే సీఐ దివాకర్ యాదవ్ స్పందించి గాలింపు చేపట్టగా బీచ్ రోడ్లో సాగర్ తీరం వద్ద ఉన్న యువతని కాపాడారు.