News October 13, 2025
కామారెడ్డి: ప్రజావాణికి 90 ఫిర్యాదులు

కామారెడ్డిలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 90 ఫిర్యాదులు వచ్చినట్లు అదనపు కలెక్టర్ చందర్ నాయక్ తెలిపారు. సోమవారం కామారెడ్డి కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించినట్లు చెప్పారు. వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో పార్థసింహారెడ్డి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ పాల్గొన్నారు.
Similar News
News October 13, 2025
PGRS సిబ్బంది పనితీరు మెరుగుపరడాలి: కలెక్టర్

కలెక్టరేట్‌లో కమాండ్ కంట్రోల్ రూమ్, PGRS సిబ్బంది తమ పనితీరు మార్చుకుని ప్రజల సంతృప్తి స్థాయిని పెంచాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రతి అర్జీని నిశితంగా పరిశీలించి, పరిష్కారం అనంతరం ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. ప్రజల సౌకర్యార్థం అర్జీలు రాయడానికి సిబ్బందిని నియమిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో J.C, DRO, PD, ఇతర అధికారులు పాల్గొన్నారు.
News October 13, 2025
విచారణ జరిపి న్యాయం చేస్తాం: నెల్లూరు ఎస్పీ

చట్ట ప్రకారం విచారణ జరిపి ప్రజలకు న్యాయం చేస్తామని ఎస్పీ డా.అజిత వేజెండ్ల తెలిపారు. నెల్లూరు పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ డేకు 125 ఫిర్యాదులు అందాయి. ప్రజా ఫిర్యాదుల పట్ల అలసత్వం ఉండరాదని.. ప్రజలతో జవాబుదారీగా వ్యవహరించి అర్జీలను పరిష్కరించాలని సిబ్బందిని ఆమె ఆదేశించారు.
News October 13, 2025
పాకిస్థాన్‌కు అఫ్గాన్ షాక్!

<<17987289>>వివాదం<<>> వేళ పాక్‌కు అఫ్గాన్ షాక్ ఇచ్చింది. తమ దేశంలో పర్యటిద్దామనుకున్న డిఫెన్స్ మినిస్టర్ ఆసిఫ్ ఖవాజా, ISI చీఫ్ ఆసిమ్ మాలిక్ వీసాలను రిజెక్ట్ చేసింది. అటు పాక్‌తో జరగనున్న టీ20 మ్యాచ్‌ను రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పాక్, లంక, అఫ్గాన్ త్వరలో ట్రై సిరీస్ ఆడాల్సి ఉంది. మరోవైపు భారత్‌తో సంబంధాలను తాలిబన్ ప్రభుత్వం పునరుద్ధించుకుంటోంది. ఆ దేశ మంత్రి ముత్తాఖీ IND పర్యటనలో ఉన్నారు.