News October 13, 2025

ఎన్‌సీడీ స్క్రీనింగ్ త్వరగా పూర్తి చేయాలి: డీఎంహెచ్‌ఓ

image

భద్రాద్రి జిల్లాలో సంక్రమణ రహిత వ్యాధుల (నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ – ఎన్‌సీడీ) స్క్రీనింగ్ కార్యక్రమాలను సమయానికి పూర్తి చేయాలని డీఎంహెచ్‌ఓ ఎస్. జయలక్ష్మి అధికారులను ఆదేశించారు. సోమవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. స్క్రీనింగ్ నిర్వహించి, ఆన్‌లైన్ డేటాను ఆలస్యం లేకుండా నమోదు చేయాలని ఆమె సూచించారు.

Similar News

News October 13, 2025

PGRS సిబ్బంది పనితీరు మెరుగుపరడాలి: కలెక్టర్

image

కలెక్టరేట్‌లో కమాండ్ కంట్రోల్ రూమ్, PGRS సిబ్బంది తమ పనితీరు మార్చుకుని ప్రజల సంతృప్తి స్థాయిని పెంచాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రతి అర్జీని నిశితంగా పరిశీలించి, పరిష్కారం అనంతరం ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. ప్రజల సౌకర్యార్థం అర్జీలు రాయడానికి సిబ్బందిని నియమిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో J.C, DRO, PD, ఇతర అధికారులు పాల్గొన్నారు.

News October 13, 2025

విచారణ జరిపి న్యాయం చేస్తాం: నెల్లూరు ఎస్పీ

image

చట్ట ప్రకారం విచారణ జరిపి ప్రజలకు న్యాయం చేస్తామని ఎస్పీ డా.అజిత వేజెండ్ల తెలిపారు. నెల్లూరు పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ డేకు 125 ఫిర్యాదులు అందాయి. ప్రజా ఫిర్యాదుల పట్ల అలసత్వం ఉండరాదని.. ప్రజలతో జవాబుదారీగా వ్యవహరించి అర్జీలను పరిష్కరించాలని సిబ్బందిని ఆమె ఆదేశించారు.

News October 13, 2025

పాకిస్థాన్‌కు అఫ్గాన్ షాక్!

image

<<17987289>>వివాదం<<>> వేళ పాక్‌కు అఫ్గాన్ షాక్ ఇచ్చింది. తమ దేశంలో పర్యటిద్దామనుకున్న డిఫెన్స్ మినిస్టర్ ఆసిఫ్ ఖవాజా, ISI చీఫ్ ఆసిమ్ మాలిక్ వీసాలను రిజెక్ట్ చేసింది. అటు పాక్‌తో జరగనున్న టీ20 మ్యాచ్‌ను రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పాక్, లంక, అఫ్గాన్ త్వరలో ట్రై సిరీస్‌ ఆడాల్సి ఉంది. మరోవైపు భారత్‌తో సంబంధాలను తాలిబన్ ప్రభుత్వం పునరుద్ధించుకుంటోంది. ఆ దేశ మంత్రి ముత్తాఖీ IND పర్యటనలో ఉన్నారు.