News October 13, 2025

కొండగట్టు అంజన్న ఆదాయం ఎంతంటే..

image

కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానంలో 81 రోజులకు గాను 12 హుండీలను ఈవో శ్రీకాంత్ రావు పర్యవేక్షణలో శ్రీ వేంకట అన్నమాచార్య ట్రస్ట్ వారు సోమవారం లెక్కించారు. హుండీ ఆదాయం రూ.1,08,72,591 నగదు, 55 విదేశీ కరెన్సీ లభించినట్లు అధికారులు తెలిపారు. వచ్చిన వెండి, బంగారంను సీల్ చేసి తిరిగి హుండీలో భద్రపరిచినట్లు వెల్లడించారు. కరీంనగర్ దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ రాజమొగిలి, అధికారులు పాల్గొన్నారు.

Similar News

News October 13, 2025

BREAKING: HYD: తుక్కుగూడలో యువకుడు సూసైడ్

image

యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పరిధి తుక్కుగూడలో ఈరోజు చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. తుక్కుగూడలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో భానుప్రసాద్(22) అనే యువకుడు ఉరేసుకుని చనిపోయాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పహడీషరీఫ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News October 13, 2025

BREAKING: HYD: తుక్కుగూడలో యువకుడు సూసైడ్

image

యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పరిధి తుక్కుగూడలో ఈరోజు చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. తుక్కుగూడలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో భానుప్రసాద్(22) అనే యువకుడు ఉరేసుకుని చనిపోయాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పహాడీషరీఫ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News October 13, 2025

నవంబర్ మొదటి వారం నుంచి పత్తి కొనుగోలు కేంద్రాలు

image

నవంబర్ మొదటివారం నుంచి ఎన్టీఆర్ జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ సోమవారం తెలిపారు. మార్కెటింగ్, వ్యవసాయం, పోలీస్, అగ్నిమాపక, రవాణా, సీసీఐ ఉన్నతాధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. మార్కెట్ యార్డ్‌లను కొనుగోలు కేంద్రాలుగా నోటిఫై చేశామన్నారు. రైతు సేవా కేంద్రాల్లోని వీఏఏలను సంప్రదించి పత్తి విక్రయాల సమాచారాన్ని తెలుసుకోవాలని రైతులకు సూచించారు.