News October 13, 2025
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం

AP: లిక్కర్ స్కామ్ కేసు నిందితుడు వెంకటేశ్ నాయుడి(A-34) ఫోన్‌ను అన్‌లాక్ చేసేందుకు సిట్‌కు ACB కోర్టు అనుమతినిచ్చింది. వెంకటేశ్ ఫోన్‌లో మరిన్ని ఆధారాలు ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. రేపు ఎఫ్ఎస్ఎల్‌లో ఫోన్ తెరవనున్నారు. లిక్కర్ స్కామ్ డబ్బును తరలించడానికి సహకారం అందించాడని వెంకటేశ్‌పై ఆరోపణలున్నాయి. అతడు డబ్బులు లెక్కిస్తున్న వీడియో అప్పట్లో వైరలైంది.
Similar News
News October 14, 2025
SC వర్గీకరణ.. మీ సేవల్లో కొత్త సర్టిఫికెట్లు తీసుకోవచ్చు: మంత్రి

TG: అన్ని మీసేవ కేంద్రాలను కొత్తగా ఉపవర్గీకరించిన షెడ్యూల్ కుల గ్రూపులతో అప్‌డేట్ చేసినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణ చట్టం నవంబర్ 15-2025, జీ.ఓ.ఎంఎస్. నంబర్ 9(షెడ్యూల్ కులాల శాఖ, 14-04-2025) ప్రకారం ఈ వర్గీకరణ వ్యవస్థను అమలు చేశామన్నారు. ఇకపై ప్రజలు తమ వర్గానికి సరిపడే ధ్రువపత్రాలను సులభంగా పొందవచ్చని, SC, ST, BC క్యాస్ట్ సర్టిఫికెట్ల రీఇష్యూ సదుపాయాన్ని కూడా ప్రారంభించామన్నారు.
News October 13, 2025
అఫ్గాన్ ప్రభుత్వంలో మాకూ చోటివ్వాలి: మైనార్టీ ప్రతినిధులు

అఫ్గాన్‌లోని గురుద్వారాలు, టెంపుళ్ల మరమ్మతు, అభివృద్ధికి తోడ్పడాలని మైనార్టీ ప్రతినిధులు ఆదేశ విదేశాంగ మంత్రి ముత్తాఖీని ఢిల్లీలో విన్నవించారు. అక్కడి ప్రభుత్వంలోనూ హిందూ, సిక్కులకు చోటివ్వాలని కోరారు. ఆలయాల పునరుద్ధరణ, భద్రత, మైనార్టీలకు ఆస్తి హక్కు కల్పించడానికి ముత్తాఖీ హామీ ఇచ్చారని వారు పేర్కొన్నారు. వాటిని సందర్శించడానికి రావాలని పిలిచారన్నారు. తాలిబన్ల రాకతో వారంతా ఇండియా వచ్చేశారు.
News October 13, 2025
పాకిస్థాన్‌కు అఫ్గాన్ షాక్!

<<17987289>>వివాదం<<>> వేళ పాక్‌కు అఫ్గాన్ షాక్ ఇచ్చింది. తమ దేశంలో పర్యటిద్దామనుకున్న డిఫెన్స్ మినిస్టర్ ఆసిఫ్ ఖవాజా, ISI చీఫ్ ఆసిమ్ మాలిక్ వీసాలను రిజెక్ట్ చేసింది. అటు పాక్‌తో జరగనున్న టీ20 మ్యాచ్‌ను రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పాక్, లంక, అఫ్గాన్ త్వరలో ట్రై సిరీస్ ఆడాల్సి ఉంది. మరోవైపు భారత్‌తో సంబంధాలను తాలిబన్ ప్రభుత్వం పునరుద్ధించుకుంటోంది. ఆ దేశ మంత్రి ముత్తాఖీ IND పర్యటనలో ఉన్నారు.