News October 13, 2025

పెంట్లవెల్లి: అసంపూర్తిగా కాలిన యువతి శవం లభ్యం

image

మండలంలోని మంచాలకట్ట సమీప చింతరాయగుట్ట వద్ద గుర్తుతెలియని యువతి అసంపూర్తిగా కాలిన శవం లభ్యమైంది. సమాచారం అందుకున్న SI రామన్ గౌడ్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. యువతి శరీరంపై పైజామా, చేతులకు గాజులు, కాళ్లకు పట్టీలు ఉన్నట్లు గుర్తించారు. యువతిపై అత్యాచారం చేసి కాల్చి చంపి ఉంటారని అనుమానం వ్యక్తమవుతోంది. ఇదే ప్రాంతంలో గతంలో బాలుడిని హత్య చేసి కాల్చిన సంఘటనతో ప్రజల్లో భయాందోళనలు వ్యాప్తి చెందుతున్నాయి.

Similar News

News October 14, 2025

HYD: ఓలా ఎలక్ట్రిక్ సర్వీస్ సెంటర్లపై ఫిర్యాదు

image

రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఓలా ఎలక్ట్రిక్ సర్వీస్ సెంటర్లపై వినియోగదారులు డీసీపీకి ఫిర్యాదు చేశారు. సర్వీసింగ్‌ మోసం వస్తే ఎక్కువ జాప్యం చేస్తున్నారని, అనుమతి లేకుండా విడిభాగాలను తొలగిస్తున్నారని చెప్పారు. అలాగే కస్టమర్ల వాహనాలను సిబ్బంది వ్యక్తిగతంగా వాడుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని వాపోయారు. సంబంధిత సెంటర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు.

తిప్పలూరు వద్ద రోడ్డు ప్రమాదం.. ట్రాఫిక్‌కు అంతరాయం

image

ఎర్రగుంట్ల మండలం కమలాపురం వెళ్లే రహదారిలోని తిప్పలూరు వద్ద సోమవారం రాత్రి కంటైనర్ -లారీ ఎదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ ఇరుక్కుపోగా అతనిని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నాలు చేస్తున్నారు. రోడ్డు మధ్యలో రెండు లారీలు ఢీకొనడంతో రోడ్డుకు ఇరువైపుల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.