News October 13, 2025
NZB: మగాళ్లను మోసగించిన మహిళలకు జైలు శిక్ష

నిజామాబాద్‌లో పురుషులను మోసం చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన ఆరుగురు మహిళలకు మెజిస్ట్రేట్ జైలు శిక్ష విధించినట్లు వన్ టౌన్ SHO రఘుపతి తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో రాత్రి వేళలో చామంతి, లతా, లక్ష్మి, ఓడ్డే లక్ష్మి, ఎల్లమ్మ, డొక్కా చంద్రకళ మగవారి పట్ల న్యూసెన్స్ చేయగా సిటీ పోలీస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు SHO పేర్కొన్నారు.
Similar News
News October 14, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 14, మంగళవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.57 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.09 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.02 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.17 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.55 గంటలకు
✒ ఇష: రాత్రి 7.07 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News October 14, 2025
తనుశ్రీకి ఉత్తమ ప్రతిభ అవార్డు

అమరాపురంలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థిని తనుశ్రీ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేత ఉత్తమ ప్రతిభ అవార్డు అందుకున్నారు. హుదుగుర్ గ్రామానికి చెందిన తిప్పేస్వామి, శోభ దంపతుల కుమార్తె తనుశ్రీ హైదరాబాదులో నృత్య ప్రదర్శనకు అవార్డు, ప్రశంసా పత్రం పొందినట్లు తెలిపారు. పాఠశాల కమిటీ, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు బాలికను అభినందించారు.
News October 14, 2025
సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలి: కలెక్టర్ ఆనంద్

ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు పెంచాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 3 లక్షలకు పైగా మొక్కలు నాటడానికి ప్రణాళికలు తయారు చేయాలని పేర్కొన్నారు. ప్రతి శాఖ నుంచి 3 వేలు పైగా మొక్కలు నాటలని ఆదేశించారు. అటవీ శాఖ 1.50 లక్షల మొక్కలు నాటాలని పేర్కొన్నారు.