News October 13, 2025

విజయవాడలో PGRSకు విశేష స్పందన

image

ప్రజా సమస్యల వేగవంత పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన PGRS కార్యక్రమాన్ని కలెక్టర్ లక్ష్మీశ సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 153 వినతులు, ఫిర్యాదులు స్వీకరించామని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులు త్వరిత చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. నిర్లక్ష్యం, లేదా గైర్హాజరైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు.

Similar News

News October 14, 2025

నిజామాబాద్: సవాలుగా మారిన బంగారం చోరీ కేసు

image

ఇందల్వాయి మండలం లింగాపూర్‌లో దుర్గాదేవి నవరాత్రుల సమయంలో భారీ చోరీ జరిగింది. గ్రామానికి చెందిన అపర్ణ పూజా కార్యక్రమానికి వెళ్లిన సమయంలో ఇంట్లో చొరబడి 8 తులాల బంగారం, 25 తులాల వెండిని దొంగలు అపహరించారు. సోమవారం బాధితురాలు సీపీ సాయి చైతన్యకు ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయంపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై సందీప్ కేసు నమోదు చేశారు.

News October 14, 2025

MDK: మహిళపై లైంగిక దాడి, హత్య.. జీవిత ఖైదు

image

మెదక్ పట్టణంలో 2020లో జరిగిన మహిళపై లైంగిక దాడి, హత్య కేసులో నిందితుడికి జిల్లా న్యాయమూర్తి నీలిమ సంచలన తీర్పు ఇచ్చారు. నిందితుడైన ఫకీరానాయక్‌కు జీవిత ఖైదు, రూ.15 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పినట్లు ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. కల్లు దుకాణం వద్ద పరిచయం పెంచుకుని, పొలానికి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

News October 14, 2025

HNK: జాతీయ రికార్డులో స్వర్ణ పతకం సాధించిన గురుకుల విద్యార్థి

image

భువనేశ్వర్‌లో జరిగిన నేషనల్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో HNK బాయ్స్ బీసీ గురుకుల పాఠశాల పదో తరగతి విద్యార్థి కంచు లవ్లిత్ ట్రయథ్లాన్ విభాగంలో 2510 పాయింట్లతో జాతీయ రికార్డు బద్దలు కొట్టి స్వర్ణ పతకం సాధించాడు. ఈ విజయంపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కార్యదర్శి శ్రీధర్, ఎంజెపి కార్యదర్శి బడుగు సైదులు లవ్లిత్‌ను అభినందించారు.