News October 13, 2025
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో తొలిరోజు 11 నామినేషన్లు

HYD జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో తొలి రోజు నామినేషన్లు ముగిశాయి. మొత్తం పది మంది 11 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. స్వతంత్రులు సిలివేరు శ్రీకాంత్, పెసరికాయల పరీక్షిత్ రెడ్డి, చంద్రశేఖర్, పూసా శ్రీనివాస్, వేముల విక్రమ్ రెడ్డి, ఇబ్రహీంఖాన్, ఆరావల్లి శ్రీనివాసరావు, సయ్యద్ ముస్తఫా హుస్సేన్, సల్మాన్ ఖాన్, సపావత్ సుమన్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. కాగా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నవంబర్ 11న జరగనుంది.
Similar News
News October 14, 2025
నిజామాబాద్: సవాలుగా మారిన బంగారం చోరీ కేసు

ఇందల్వాయి మండలం లింగాపూర్‌లో దుర్గాదేవి నవరాత్రుల సమయంలో భారీ చోరీ జరిగింది. గ్రామానికి చెందిన అపర్ణ పూజా కార్యక్రమానికి వెళ్లిన సమయంలో ఇంట్లో చొరబడి 8 తులాల బంగారం, 25 తులాల వెండిని దొంగలు అపహరించారు. సోమవారం బాధితురాలు సీపీ సాయి చైతన్యకు ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయంపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై సందీప్ కేసు నమోదు చేశారు.
News October 14, 2025
MDK: మహిళపై లైంగిక దాడి, హత్య.. జీవిత ఖైదు

మెదక్ పట్టణంలో 2020లో జరిగిన మహిళపై లైంగిక దాడి, హత్య కేసులో నిందితుడికి జిల్లా న్యాయమూర్తి నీలిమ సంచలన తీర్పు ఇచ్చారు. నిందితుడైన ఫకీరానాయక్‌కు జీవిత ఖైదు, రూ.15 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పినట్లు ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. కల్లు దుకాణం వద్ద పరిచయం పెంచుకుని, పొలానికి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
News October 14, 2025
HNK: జాతీయ రికార్డులో స్వర్ణ పతకం సాధించిన గురుకుల విద్యార్థి

భువనేశ్వర్‌లో జరిగిన నేషనల్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో HNK బాయ్స్ బీసీ గురుకుల పాఠశాల పదో తరగతి విద్యార్థి కంచు లవ్లిత్ ట్రయథ్లాన్ విభాగంలో 2510 పాయింట్లతో జాతీయ రికార్డు బద్దలు కొట్టి స్వర్ణ పతకం సాధించాడు. ఈ విజయంపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కార్యదర్శి శ్రీధర్, ఎంజెపి కార్యదర్శి బడుగు సైదులు లవ్లిత్‌ను అభినందించారు.